TSPSC: టీఎస్‌పీఎస్సీ సంచలన నిర్ణయం.. ఆ 37 మంది డీబార్.. మరోసారి పరీక్షలు రాయకుండా..

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రాల లీకేజీతో ప్రమేయమున్న వారిని డీబార్‌ చేయాలని నిర్ణయించింది. ఈ కేసుల కీలక సూత్రదారులుగా గుర్తించిన 37 మందిని శాశ్వతంగా డిబార్ చేస్తున్నట్లుగా ప్రకటించింది టీఎస్‌పీఎస్సీ.

TSPSC: టీఎస్‌పీఎస్సీ సంచలన నిర్ణయం.. ఆ 37 మంది డీబార్.. మరోసారి పరీక్షలు రాయకుండా..
TSPSC Paper Leak

Updated on: May 30, 2023 | 8:44 PM

టీఎస్‌పీఎస్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రాల లీకేజీలో ప్రమేయమున్న వారిని డీబార్‌ చేయాలని నిర్ణయించింది. సిట్‌ అరెస్టు చేసిన 37 మంది ఇకముందు టీఎస్‌పీఎస్సీ నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా నిషేధించాల‌ని కమిషన్‌‌ను ఆదేశించింది. దీనిపై అభ్యంతరాలుంటే రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని 37 మంది నిందితులకు టీఎస్‌పీఎస్సీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ప్రత్యేక దర్యాప్తు బృందం 44 మందిపై కేసు నమోదు చేయగా..  ఈ కేసులో ఇప్పటికే 50 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో తవ్వేకొద్దీ సంచలనాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

మొదట్లో లక్షల్లోనే డీలింగ్స్ జరిగాయని అనుకున్నారు.. కానీ కోట్ల రూపాయలు చేతులు మారినట్టు తేలింది. ఇక లేటెస్ట్‌గా ఈ కేసులో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. టెక్నాలజీలోనే సంచలనంగా మారిన చాట్ జీపీటీ ఉపయోగించి.. కాపీయింగ్‌కి పాల్పడింది ఈ లీక్ గ్యాంగ్. అసలు చాట్ జీపీటీని ఎలా ఉపయోగించారు.? దాని ద్వారా కాపీయింగ్ ఎలా సాధ్యమైంది? ఎలక్ట్రానిక్ డివైజ్‌లు ఎగ్జామ్ హాల్లోకి అసలు ఎలా వెళ్లాయి? అన్నదే ఇప్పుడ అసలు ప్రశ్న.

ఏఈఈ, డీఏవో పరీక్షకు సంబంధించిన 25 ప్రశ్నపత్రాలను డీఈ రమేష్ విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో పేర్కొంది. ఏఈఈ పరీక్షలో ఏడుగురు అభ్యర్థులకు పరీక్ష హాల్‌లోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జట్స్ ద్వారా డీఈ రమేష్ సమాధానాలు అందించినట్లు తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం