Telangana: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. వార్షిక సిలబస్‌పై బోర్డు కీలక నిర్ణయం..

తెలంగాణ ఇంటర్ బోర్డు సిలబస్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే పరీక్షల నిర్వహణ గురించి కూడా కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు మీ కోసం.

Telangana: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్..  వార్షిక సిలబస్‌పై బోర్డు కీలక నిర్ణయం..
Telangana Inter Board

Updated on: Jun 24, 2022 | 3:23 PM

TS Intermediate Syllabus 2022-23: తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్. ఈ అకడమిక్ ఇయర్‌లో 100 శాతం సిలబస్ ఉంటుందని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) స్పష్టం చేసింది. సిలబస్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ విద్యా సంవత్సరం 2022-23 నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు 100 శాతం సిలబస్ ఉంటుందని పేర్కొంది. అంతేకాదు పాత విధానంలోనే ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లగా 70 శాతం సిలబస్‌తోనే సరిపెట్టింది బోర్డు. లాక్‌డౌన్ కారణంగా క్లాసులు ఎక్కువగా జరగనుందున.. విద్యార్థులు ఒత్తిడికి గురవ్వకుండా ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి మాత్రం కరోనా ముందు ఉన్నట్లుగానే ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ సిలబస్ ఉంటుందని స్పష్టం చేసింది. అన్ని సబ్జెక్ట్స్ యొక్క సిలబస్ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్(www.tsbie.cgg.gov.in)లో ఉంచనున్నట్లు తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..