Telangana: విద్యార్థుల కోసం తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం.. అందుబాటులోకి ‘టెలి-మానస్’ సేవలు..

|

Mar 03, 2023 | 6:07 PM

TSBIE: పరీక్షలు, ఫలితాల విషయంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతురన్న విద్యార్థుల కోసం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు ‘టెలి-మానస్’ సేవలను

Telangana: విద్యార్థుల కోసం తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం.. అందుబాటులోకి ‘టెలి-మానస్’ సేవలు..
Tsbie
Follow us on

పరీక్షలు, ఫలితాల విషయంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతురన్న విద్యార్థుల కోసం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు ‘టెలి-మానస్’ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ‘టెలి-మానస్’ పేరుతో సైకాలజిస్టుల సేవలు అందించనుంది. ఇంటర్ విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించేందుకు ఈ టెలి మానస్ సేవలు ఉపకరించనున్నాయని ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ పరీక్షలు, ఫలితాల నేపథ్యంలో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని, అలాంటి వారు ‘టెలి-మానస్’కు కాల్ చేసి నిపుణులతో కౌన్సిలింగ్ తీసుకోవచ్చని ఇంటర్ బోర్డు పేర్కొంది. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ 14416 ప్రకటించింది. ఈ నెంబర్‌కు కాల్ చేసి ఉచితంగా మానసిక వైద్యులను సంప్రదించవచ్చునని ఇంటర్ బోర్డు కార్యదర్శి పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఇంటర్ విద్యార్థులు, పేరెంట్స్‌కి ఉచితంగా సైకాలజిస్ట్ కన్సల్టేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థుల బలవర్మరణ వార్తలతో చదువుల ప్రాంగణాలు, వాళ్లవాళ్ల కుటుంబాలు విషాద వాతావరణంతో నిండిపోతున్నాయి. రోదనలు మిన్నంటుతున్నాయి. తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. సాత్విక్ ఘటన మరువకముందే మరో స్టూడెంట్ ట్రాజెడీ వెలుగులోకొచ్చింది. ఇలా బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటూ బలిపీఠమెక్కుతూనే ఉన్నారు విద్యార్థులు. చదువుల చెరలో బందీలు మారి… నిండు నూరేళ్ల జీవితాన్ని సమర్పించుకుంటూనే ఉన్నారు. వీళ్ల చావులక్కూడా చదువు పేరిట జరిగే ఒత్తిళ్లే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన తెలంగాణ ఇంటర్ బోర్డు.. విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపేందుకు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే ‘టెలి-మానస్’ పేరుతో సైకాలజిస్టుల సేవలు అందించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..