బీసీల సంక్షేమానికి కేసీఆర్ ప్రాధాన్యం

|

Sep 07, 2020 | 7:32 PM

బీసీల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. బీసీ కులాల సహకార సంస్థల ద్వారా బీసీ సంక్షేమశాఖ...

బీసీల సంక్షేమానికి కేసీఆర్ ప్రాధాన్యం
Follow us on

బీసీల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. బీసీ కులాల సహకార సంస్థల ద్వారా బీసీ సంక్షేమశాఖ ఇప్పటివరకూ 5,36,922 మంది లబ్ధ్దిదారులకు రూ. 14,187.07 కోట్ల సబ్సిడీ రుణాలు అందించిందని తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మహాత్మా జ్యోతిబాఫూలే ఓవర్సీస్‌ విద్యానిధి పథకం కింద రూ.8.38 కోట్లు విడుదల చేసినట్టు వెల్లడించారు. కల్యాణలక్ష్మి కింద ఇప్పటికే రూ.675 కోట్లు విడుదల చేసినట్టు వివరించారు. రానున్న కాలంలో బీసీల సంక్షేమం కోసం మరిన్ని సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేయాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచనగా ఉందని గంగుల స్పష్టం చేశారు.