Pilot Rohit Reddy: ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు.. ఈడీ విచారణ స్టేకు నిరాకరణ..

|

Dec 28, 2022 | 3:07 PM

బీఆర్‌ఎస్‌ తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఈడీ విచారణపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది.

Pilot Rohit Reddy: ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు.. ఈడీ విచారణ స్టేకు నిరాకరణ..
Pilot Rohit Reddy
Follow us on

తాండూరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఈడీ విచారణపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. తనపై జరుగుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణను నిలిపివేయాలని కోరుతూ రోహిత్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈడీ దర్యాప్తును వ్యతిరేకిస్తూ హైకోర్టులో రోహిత్‌ పిటిషన్ దాఖలు చేసి.. నలుగురుని ప్రతివాదులుగా చేర్చారు. పైలట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. వ్యక్తిగత, కుటుంబ, ప్రైవేటు సమాచారాన్ని సేకరించేందకే ఈడీ తనను విచారిస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌ తరపున న్యాయవాది నిరంజన్‌రెడ్డి కోర్టుకు తమ వాదనలు వినిపించారు. ఈ విచారణను నిలిపివేయాలని కోరారు.

కేవలం రోహిత్‌రెడ్డి ఫిర్యాదుదారుడు మాత్రమే, సంబంధం లేకుండా మనీలాండరింగ్‌ కేసు పెట్టి, నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని వాదనలు వినిపించారు. పార్టీ మారాలని రూ.100 కోట్లు ఆఫర్‌ చేశారని.. డబ్బులు ఇవ్వనప్పుడు మనీలాండరింగ్‌ ఎక్కడ ఉంటుందని హైకోర్టులో వాదించారు.

లావాదేవీలు జరగనందున ఈడీ ఈసీఐఆర్ మనీలాండరింగ్ విచారణ చట్టానికి విరుద్ధం అంటూ పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రం, ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు రోహిత్‌ అభ్యర్థనను తిరస్కరిస్తూ తదుపరి విచారణను జనవరి 5కు వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..