తెలంగాణలో ప్రభుత్వ భూముల వేలం ఇవాళ కూడా కొనసాగనుంది. నిన్న కోకాపేట భూముల వేలం నిర్వహించిన HMDA..శుక్రవారం ఖానామెట్ భూములను ఈ వేలం వేయనుంది. మొత్తం 15.01 ఎకరాల భూమిలోని 5 ప్లాట్లను ఈ-ఆక్షన్ ద్వారా విక్రయించనున్నారు. నిన్న అంచనాలకు మించి ధర పలికాయి కోకాపేట భూములు. నిన్నటి వేలంలో దాదాపు 2వేల కోట్ల రూపాయలకు పైగా రెవెన్యూ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఖానామెట్ భూములపై కూడా భారీ అంచనాలున్నాయి.
ఈ భూములకు కూడా ఎలాంటి చిక్కులు కూడా లేవని.. సింగిల్ విండో ద్వారా త్వరగా అనుమతులిస్తామని చెబుతోంది TSIIC. ఈ ఆక్షన్ ఇవాళ రెండు విడతలుగా జరగనుంది. 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు,..ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ వేలం జరగనుంది.