AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మీ ఆలన అంతా మాదే.. 365 రోజులు ఉచితంగా వైద్యం.. మంచానికే పరిమితమైన వారికి అండగా తెలంగాణ సర్కార్

Allana Centre: దీర్ఘకాల సమస్యలతో బాధపడుతూ జీవిత చరమాంకంలోని రోగులను దగ్గరకు తీసుకునేందుకు కొత్త ప్రణాళికతో ముందకు వచ్చింది. ఆలన కేంద్రాలను వైద్య ఆరోగ్య శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంట్లో మంచంలోనే ఉండిపోయిన రోగులకు ఆలన కేంద్రాలు అంటే.. పాలేటివ్‌ కేర్‌ వరంగా మారుతున్నాయి. ఇలాంటి వారిని కేంద్రాల్లో చేర్పించాలని అధికారులు సూచిస్తున్నారు.

Telangana: మీ ఆలన అంతా మాదే.. 365 రోజులు ఉచితంగా వైద్యం.. మంచానికే పరిమితమైన వారికి అండగా తెలంగాణ సర్కార్
Palliative Care Centers
Sanjay Kasula
|

Updated on: Sep 04, 2023 | 11:46 AM

Share

హైదరాబాద్, సెప్టెంబర్ 04: తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. పేదలకు మెరుగైన వైద్యం అదించేందుకు ప్రత్యేక చర్యలకు దిగుతోంది. అప్పటికే నూతన ఆస్పత్రులు, అంబులెన్సులు, ల్యాబ్ టెస్టులు ఇలా అనేక సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీర్ఘకాల సమస్యలతో బాధపడుతూ జీవిత చరమాంకంలోని రోగులను దగ్గరకు తీసుకునేందుకు కొత్త ప్రణాళికతో ముందకు వచ్చింది. ఆలన కేంద్రాలను వైద్య ఆరోగ్య శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంట్లో మంచంలోనే ఉండిపోయిన రోగులకు ఆలన కేంద్రాలు అంటే.. పాలేటివ్‌ కేర్‌ వరంగా మారుతున్నాయి. ఇలాంటి వారిని కేంద్రాల్లో చేర్పించాలని అధికారులు సూచిస్తున్నారు.

తెలంగాణ రెడ్‌హిల్స్ ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో 6 పడకలతో ఆలన కేంద్రాలను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా గడ్డిఅన్నారంలోనూ ఆలన సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇక్కడ కూడా ఆరు పడకలను అందుబాటులో ఉంచుతున్నారు. వ్యాధిగ్రస్తులకు ఓపీ, ఐపీ, హోమ్‌కేర్‌ సర్వీసులను అందిస్తున్నారు. చాలామంది క్యాన్సర్‌ ఇతర రోగాలతో మంచంలో ఉండిపోయినవారికి తీవ్ర మనోవేదనకు గురవుతుంటారు.

ఇంట్లో ఓ వ్యక్తి మంచంలోనే ఉండిపోతే.. ఆ ప్రభావం మిగతా కుటుంబ సభ్యులపై పడుతోంది. ఆర్థిక స్తోమత లేని రోగుల పరిస్థితి దారుణంగా ఉంటోంది. నయం చేయలేని వ్యాధులతో బాధపడుతున్న రోగులందరికీ ఉచిత పాలియేటివ్ కేర్ సౌకర్యాలు అందేలా చూడాలని ఆరోగ్య అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలాంటివారిని ఆదుకునేందుకు తెలంగాణ సర్కార్ ఆలన కేంద్రాల ద్వారా అన్ని సేవలు అందిస్తుంది. కుటుంబ సభ్యులకు భారం కాకుండా.. కేంద్రాల్లో వారికి అన్ని రకాల చికిత్సలు అందిస్తున్నారు. అన్ని విధాలుగా బాధితులకు సాంత్వన చేకూర్చడమే ఆలన కేంద్రాల ప్రధాన విధి.

వీటిలో వైధ్యుడితోపాటు, ఫిజియోథెరపిస్టు, స్టాఫ్ నర్సులు, ఆయాలు ఉండనున్నారు. 365 రోజులు 24 గంటలపాటు వీరు అందుబాటులో ఉంటారు. తెలంగాణలోని అన్ని జిల్లా ఆసుపత్రుల్లో క్యాన్సర్ వంటి చివరి దశ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు పాలియేటివ్ కేర్ సౌకర్యాలు రానున్న నెలల్లో వాస్తవం కానున్నాయి. వారికి ఉచిత వసతి, భోజనం, మందులు, ఫిజియోథెరఫీ తదితర సేవలు అందుబాటులో ఉంటాయి.

ప్రతి పాలియేటివ్ కేర్ ఫెసిలిటీలో ఒక వైద్యుడు, 5 నర్సులు, ఒక ఫిజియోథెరపిస్ట్, ఒక డ్రైవర్, 5 మంది నాన్-క్లినికల్ సిబ్బంది రోగులను, రోజువారీ కార్యకలాపాలను చూసేందుకు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఒక్కో ఉచిత పాలియేటివ్ కేర్ సౌకర్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 30 లక్షల నుంచి రూ. 35 లక్షల వరకు ఖర్చు చేస్తోంది.

జిల్లా ఆసుపత్రి ఆవరణలో ఉన్న పాలియేటివ్ కేర్ సౌకర్యాలు ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్, హోమ్ కేర్ సేవలను అందిస్తాయి. సంరక్షణను సులభతరం చేయడానికి.. ప్రొవైడర్లు రోగుల ఇళ్లకు ప్రయాణిస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ హోమ్ కేర్ యూనిట్స్ (MHCU)గా పిలువబడే 17 మొబైల్ వ్యాన్‌లను ప్రారంభించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..