తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్‌.. ఈ నెలాఖరులోగా కీలక ప్రకటన వెలువడే అవకాశం

తెలంగాణలో ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ), పదవీ విరమణ వయసు పెంపు తదితర సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నెల 27న..

తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్‌.. ఈ నెలాఖరులోగా కీలక ప్రకటన వెలువడే అవకాశం

Updated on: Jan 26, 2021 | 11:49 AM

తెలంగాణలో ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ), పదవీ విరమణ వయసు పెంపు తదితర సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ.. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపే అవకాశముంది.

ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని సీఎస్‌కు సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో సోమేశ్‌కుమార్‌ చర్చలకు రావాల్సిందిగా టీఎన్జీవో నేతలను ఆహ్వానించారు. ఉద్యోగ సంఘాలు చర్చలకు ఎప్పుడు వస్తాయో చెప్పాలని కోరారు. దీంతో అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించి తేదీ తెలుపుతామని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ సీఎస్‌కు తెలిపారు.

ఈ నెల 27న త్రిసభ్య కమిటీతో సమావేశమై చర్చలు జరపాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. అదే రోజు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉద్యోగ సంఘాల చేతికి పీఆర్సీ నివేదికను అందజేసే అవకాశాలున్నాయి. చర్చల అనంతరం సీఎం కేసీఆర్‌కు నివేదిక సమర్పించనునున్నారు. మొత్తానికి ఈ నెలాఖరులోగా ఉద్యోగులకు పీఆర్సీ, పదవీ విరమణ వయసు పెంపుపై కీలక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈడీ డైరెక్టర్ ఎస్‌కే మిశ్రా పదవీకాలం పొడిగింపు, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం