TS Eamcet 2023 Counselling schedule: మరో రెండు రోజుల్లో తెలంగాణ ఎంసెట్‌-2023 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌..!

|

May 25, 2023 | 12:22 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ విద్యాసంస్థల్లో స్థానిక కోటా కింద రాష్ట్ర అభ్యర్ధులకు 85 శాతం కోటా ఉవ్వనున్నారు. మిగిలిన 15 శాతం సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్ధులకు..

TS Eamcet 2023 Counselling schedule: మరో రెండు రోజుల్లో తెలంగాణ ఎంసెట్‌-2023 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌..!
TS Eamcet 2023 Counselling
Follow us on

తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాలు గురువారం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల చేశారు. ఇంజనీరింగ్‌లో 80 శాతం.. అగ్రికల్చర్‌లో 86 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ విద్యాసంస్థల్లో స్థానిక కోటా కింద రాష్ట్ర అభ్యర్ధులకు 85 శాతం కోటా ఉవ్వనున్నారు. మిగిలిన 15 శాతం సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్ధులకు కేటాయించనునున్నారు. ఇంటర్‌ వెయిటేజీ రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగానే అడ్మిషన్లు ఇవ్వనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగానే సీట్లు కేటాయించనున్నారు. అంటే.. ర్యాంకు, కోర్సు, అందుబాటులో ఉన్న సీట్లు ఆధారంగా ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ అడ్మిషన్లు ఉంటాయన్నమాట.

ఇక ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ కూడా త్వరలో ప్రారంభంకానుంది. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను మరో ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. కాగా మే 10 నుంచి 14 వరకు నిర్వహించిన ఎంసెట్‌ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. ఎటువంటి లీకులకు తావులేకుండా ఎంతో పకడ్బందీగా ఈ సారి పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, మెడికల్ విభాగాల్లోని టాప్‌ ఐదు ర్యాంకుల్లో నలుగురు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులే కావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.