TS Eamcet 2022 exam dates: కోవిడ్ ఉధృతి కొంత తగ్గుముఖం పట్టడంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు ఇప్పుడిప్పుడే తెరచుకుంటున్నాయి. ఇక తెలంగాణలో ఫిబ్రవరి 1న రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు తెరచుకున్న విషయం తెలిసిందే. మరిస్థితి మరికొంత సర్ధుమనిగితే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS Eamcet 2022) జూన్-జూలైలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 20 నుంచి ఫస్ట్ ఇయర్ పరీక్షలు, ఏప్రిల్ 21 నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఇక దీనితోపాటు ఇతర సెట్‌లకు కూడా షెడ్యూల్ ఫిక్స్ చేయాలని TSCHE భావిస్తోంది. సాధారణంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన ఒక నెల తర్వాత వివిధ CETలకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తారు. కాబట్టి ఈ ఏడాది కూడా అదే విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. షెడ్యూల్‌ను రూపొందించేందుకు ఇతర సెట్ కమిటీ సభ్యులతో పాటు కన్వీనర్‌లతో సమావేశం నిర్వహిస్తామని టీఎస్‌సీహెఈ చైర్మన్ ఆర్ లింబాద్రి అన్నారు. కాగా ఏ ఏడాది మార్చి నాటికి అన్ని సెట్లకు సంబంధించిన షెడ్యూల్, నోటిఫికేషన్లను విడుదల చేసే అవకాశముంది.
Also Read: