Munugode Bypoll: మునుగోడుకు కేంద్రం చేసిందేంటి? బీజేపీపై ఛార్జిషీట్ విడుదల చేసిన టీఆర్ఎస్

|

Oct 29, 2022 | 10:25 PM

మునుగోడు మహాయుద్ధం ప్రచారం మరో మూడు రోజుల్లో ముగియనుండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఒక వైపు ఆరోపణలు, మరో వైపు కౌంటర్లతో మునుగోడు రాజకీయం రసవత్తరంగా మారింది.

Munugode Bypoll: మునుగోడుకు కేంద్రం చేసిందేంటి? బీజేపీపై ఛార్జిషీట్ విడుదల చేసిన టీఆర్ఎస్
Trs Vs Bjp
Follow us on

మునుగోడు మహాయుద్ధం ప్రచారం మరో మూడు రోజుల్లో ముగియనుండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఒక వైపు ఆరోపణలు, మరో వైపు కౌంటర్లతో మునుగోడు రాజకీయం రసవత్తరంగా మారింది. అవును, మునుగోడు ఉపఎన్నిక సమీపిస్తున్న కొద్ది రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఛార్జ్‌షీట్లు, వైట్‌పేపర్స్‌, ప్రమాణాలు, సంప్రోక్షణలు తీవ్రమవుతున్నాయి. మునుగోడు ఉపఎన్నికలో ఒక అసాధారణమైన, విచిత్రమైన పరిస్థితి కనబడుతోందని టీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ అన్నారు. సంక్షేమం గురించి తాము మాట్లాడుతుంటే.. బీజేపీ మాత్రం విమర్శలకు పరిమితమైందని దుయ్యబట్టారు. ఈ పరిస్థితుల్లో తాము మునుగోడు ప్రజలపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తున్నామని ప్రకటించారు.

ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మునుగోడులో ఫ్లోరోసిస్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు, మర్రిగూడలో 300 పడకల ఆస్పత్రి ఏమైందని బీజేపీని నిలదీశారు. మరో వైపు టీఆర్ఎస్ విడుదల చేయాల్సింది ఛార్జ్‌షీట్‌ కాదని, శ్వేతపత్రం అని బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్‌ ఆరోపించారు. ఏనిమిదేళ్ల పాలనలో ఏం చేశారో ప్రజలకు వెల్లడించాలని చుగ్‌ డిమాండ్‌ చేశారు. అటు కాంగ్రెస్‌ కూడా మునుగోడులో ప్రచారాన్ని ఉధృతం చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి – పాల్వాయి స్రవంతి తరపున ప్రచారం చేశారు. మొత్తానికి మునుగోడు ఉపఎన్నిక ప్రచారం మరో మూడు రోజుల్లో ముగియనుంది. నవంబర్‌ 3న మునుగోడు పోలింగ్‌ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

 

టీఆర్ఎస్ విడుదల చేసిన ఛార్జి షీట్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..