Municipal Elections Result 2021: తెలంగాణ పురపాలక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ హవా.. అన్ని చోట్ల గులాబీ రెపరెపలు..

|

May 03, 2021 | 10:32 PM

Municipal Corporation elections result 2021: తెలంగాణలో 2 కార్పోరేషన్లు, 5 మున్సిపాలిటీలకు శుక్రవారం పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. వరంగల్‌, ఖమ్మం కార్పోరేషన్లకు

Municipal Elections Result 2021: తెలంగాణ పురపాలక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ హవా.. అన్ని చోట్ల గులాబీ రెపరెపలు..
Trs Party Clean Sweep 5 Municipalities
Follow us on

Municipal Corporation elections result 2021: తెలంగాణలో 2 కార్పోరేషన్లు, 5 మున్సిపాలిటీలకు శుక్రవారం పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. వరంగల్‌, ఖమ్మం కార్పోరేషన్లకు ఎన్నికలు జరగగా.. సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్‌, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు, పలు మున్సిపాలిటీల్లోని 8 వార్డులకు కూడా ఉప ఎన్నికలు కూడా జరిగాయి. అయితే ఈరోజు వెలువడిన ఫలితాల్లో గులాబీ పార్టీ 2016 కంటే మంచి ఫలితాలు సాధించింది. ఈ పోరులో ప్రతిపక్షపార్టీలు ఒక్క మున్సిపాలిటీని కూడా దక్కించుకోలేకపోయాయి. కాగా.. వీటిలో వరంగల్‌, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట పాలకవర్గాల పదవీకాలం పూర్తి కావడంతో ఎన్నికలు జరగగా.. నకిరేకల్‌, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పాటయ్యాయి.

వరంగల్‌ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ)
1934లో వరంగల్ మున్సిపాలిటీ ఏర్పడింది.
1952లో వరంగల్లు మున్సిపాలిటీకి మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి.
జూలై, 1959లో స్పెషల్‌ గ్రేడ్ గా మారిన వరంగల్‌
జూలై, 1960 లో సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా మార్పు
ఆగష్టు 18,1994న నగర పాలక సంస్థగా ఆవిర్భావం
జనవరి, 2015లో 42 గ్రామపంచాయతీలను కలిపి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌గా ఆవిర్భావం.
ఆతర్వాత కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన స్మార్ట్ సిటీలలో వరంగల్ నగరం ఒకటి
2016లో జరిగిన ఎన్నికలలో 58 డివిజన్లకు గాను టీఆర్‌ఎస్‌ 44 స్దానాలలో విజయం
ఆ ఎన్నికలలో కాంగ్రెస్‌-4, సీపీఐ-1, బీజేపీ-1, ఇతరులు-8 స్ధానాలలో గెలుపొందారు.
మేయర్‌గా మొదట్లో నన్నపునేని నరేందర్‌, తరువాత గుండా ప్రకాశ్‌రావు మేయర్ గా ఉన్నారు
తాజాగా డివిజన్ల సంఖ్య 66 కు చేరింది.
2021 ఎన్నికల ఫలితాలు…
గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (మొత్తం డివిజన్లు-66)…
2021 తాజా ఎన్నికల్లో 48 స్థానాలలో టీఆర్‌ఎస్‌ విజయం, కాంగ్రెస్ 4, బీజేపీ 10, ఇతరులు 4 గెలుపొందారు.
2016లో వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో మొత్తం 58 డివిజన్లకు గాను 44 చోట్ల టీఆర్‌ఎస్‌ విజయం

ఖమ్మం నగరపాలక సంస్థ…
అక్టోబర్19, 2012న ఏర్పడిన ఖమ్మం నగర పాలక సంస్ధ
1952లో మొదట 3వ గ్రేడు పురపాలక సంఘంగా ఏర్పాటు
1959లో 2వ గ్రేడుగా ఏర్పాటు
1980 లో 1వ గ్రేడుగా ఖమ్మం
మే 18, 2001న స్పెషల్ గ్రేడ్ గా అప్‌గ్రేడ్
మార్చి 6, 2016న ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కోసం మొదటి ఎన్నికలు
50 డివిజన్లకు టీఆర్ఎస్, టిడిపి, కాంగ్రెస్-సిపిఐ కూటమి, సిపిఐ (ఎం),
వైయస్ఆర్ కాంగ్రెస్,బిజెపి పార్టీలకు తోడు స్వతంత్రులు
మొత్తం 291 మంది అభ్యర్థులు పోటీ
తాజాగా నగరపాలక సంస్థలో పద్నాలుగు గ్రామాలు విలీనం
ప్రస్తుతం మొత్తం వార్డుల సంఖ్య -60
2021 తాజా ఎన్నికల్లో 43 స్థానాలలో టీఆర్‌ఎస్‌ విజయం (సీపీఐ 3) కూటమితో కలిపి 46 గెలుచుకుంది. కాంగ్రెస్ 9, బీజేపీ 1, సీపీఎం 2, ఇతరులు 2 గెలిచారు.
2016లో ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో మొత్తం 50 డివిజన్లకుగాను 30 చోట్ల టీఆర్‌ఎస్‌ విజయం

మున్సిపాలిటీలు…
సిద్దిపేట మున్సిపాలిటీ ..
1952లో ఏర్పడిన సిద్దిపేట మున్సిపాలిటీ
2016లో మొత్తం వార్డులు 34
తాజాగా 43కు పెరిగిన వార్డుల సంఖ్య
2021 తాజా ఎన్నికల్లో 36 వార్డులలో టీఆర్‌ఎస్‌ విజయం, బీజేపీ 1, ఇతరులు 6 గెలిచారు.
2016 ఎన్నికలలో మొత్తం 34 వార్డులకు గాను 22 చోట్ల టీఆర్‌ఎస్‌ విజయం

అచ్చంపేట మున్సిపాలిటీ ..
జూన్‌ 25,2013లో నాగర్‌ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన గ్రామాలతో పురపాలక సంఘం ఏర్పాటు
మొత్తం 20 వార్డులు
2021 తాజా ఎన్నికల్లో 13 వార్డులు కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ 6, బీజేపీ 1 గెలుచుకుంది.
2016లో నగర పంచాయతీగా ఉన్న అచ్చంపేట ఎన్నికలలో మొత్తం 20 వార్డులలోనూ టీఆర్‌ఎస్‌ ఘన విజయం

నకిరేకల్‌ మున్సిపాలిటీ ..
డిసెంబర్‌ 16 2020 నుంచి మునిసిపాలిటీగా మారిన నకిరేకల్‌ గ్రామపంచాయతీ
ఆగస్టు 24, 2011న నకిరేకల్‌ మునిసిపాలిటీగా ఏర్పాటు
నకిరేకల్‌తో పాటు మండలంలోని తాటికల్‌, కడపర్తి, నెల్లిబండ, చందంపల్లి,
చందుపట్ల, నోముల గ్రామాలను నకిరేకల్‌ మున్సిపాలిటీలో కలిపిన ప్రభుత్వం
మున్సిపాలిటీకి పన్నులు చెల్లించలేమని హైకోర్టును ఆశ్రయించిన విలీన గ్రామాల ప్రజలు
2013 సెప్టెంబరులో నకిరేకల్‌ మునిసిపాలిటీ రద్దు
గ్రామపంచాయతీగానే ఉండాలని ఆదేశించిన హైకోర్టు
2014 పిబ్రవరిలో అమలులోకి వచ్చిన ఉత్తర్వులు
డిసెంబరు 5, 2015న నకిరేకల్‌ మేజర్‌ గ్రామపంచాయతీతో పాటు ఆరు గ్రామపం చాయతీలకు ఎన్నికలు
2018లో నకిరేకల్‌ మున్సిపాలిటీ గా మళ్లీ ఏర్పాటు
డిసెంబర్‌ 16 ,2018 నుంచి మునిసిపా లిటీగా కొనసాగాలని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
మిగతా ఆరు గ్రామాలకు అధికారులతో పాలన కొనసాగింపు
మొత్తం వార్డుల సంఖ్య-20
టీఆర్‌ఎస్‌ -12, కాంగ్రెస్‌ -2, ఇతరులు -6 గెలుపొందారు.

జడ్చర్ల మున్సిపాలిటీ ..
జులై 2018లో మున్సిపాలిటీగా ఏర్పడిన జడ్చర్ల
2012 లోనే జడ్చర్ల పట్టణాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్పించిన అప్పటి ప్రభుత్వాలు
విలీన గ్రామాల ప్రజలు కోర్టుకెక్కడంతో అప్పటి నుంచి జడ్చర్ల మున్పిపాలిటీకి జరగని ఎన్నికలు
2020 డిసెంబర్‌ లో కావేరమ్మ పేట గ్రామపంచాయతీ కార్యవర్గం పదవీ కాలం ముగియడంతో
జడ్చర్ల మున్సిపల్ పోరుకు లైన్ క్లియర్
వార్డుల విభజన , ఓటర్ లిస్ట్, రిజర్వేషన్ ల కేటాయింపు ప్రక్రియలో నిమగ్నమైన అధికారులు
ప్రస్తుతం మొత్తం వార్డుల సంఖ్య-27
2021-జడ్చర్ల ఫలితాలు (మొత్తం వార్డులు-27)… టీఆర్‌ఎస్‌ -23 గెలుపొందగా.. కాంగ్రెస్‌ -2, బీజేపీ -2 డివిజన్లల్లో గెలుపొందాయి.

కొత్తూరు మున్సిపాలిటీ..
హైదరాబాద్‌, షాద్‌నగర్‌ మధ్యలో కొత్తూరు మండలం ఉంది
2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్తూరు మండలాన్ని (1+10) పదకొండు గ్రామాలతో కొత్తగా ఏర్పాటు చేశారు,.
ప్రస్తుతం కొత్తూరును మున్సిపాలిటీగా మార్చారు..
మున్సిపల్ పోరుకు లైన్ క్లియర్. కొత్తూరు మున్సిపాలిటీ వార్డుల విభజన ,
ఓటర్ లిస్ట్, రిజర్వేషన్ ల కేటాయింపు ప్రక్రియలో నిమగ్నమైన అధికారులు
మొత్తం వార్డుల సంఖ్య-12
టీఆర్‌ఎస్‌ -7, కాంగ్రెస్‌ -5,

Also Read:

Viral: ల్యాండింగ్‌కు 20 నిమిషాల ముందు విమానం అదృశ్యం.. అంతుచిక్కని రహస్యం.. కట్ చేస్తే.!

Toll Plaza Lorry Accident: టోల్‌ ఫ్లాజా వద్ద లారీ బీభత్సం… అదుపుతప్పి దూసుకెళ్లిన వాహనం.. ఇద్దరికి తీవ్ర గాయాలు