TS Minister Harish Rao: వడ్ల కొనుగోలు విషయంలో బీజేపీ నేతలను గ్రామగ్రామాన నిలయాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. వడ్లు ఎందుకు కొనుగోలు చేయరో బీజేపీ నేతలు గ్రామాలకు వస్తే గళ్లా పట్టుకుని అడగాలన్నారు. అలాగే బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందో ప్రశ్నించాలని సూచించారు. గజ్వేల్‌లో జరిగిన రైతు ధర్నాలో పాల్గొని మాట్లాడిన ఆయన.. రైతన్న బాగుపడాలంటే కేంద్రంలో బీజేపీ గద్దే దిగాల్సిందేనన్నారు. బీజేపీ రైతులను దగా చేస్తోందని.. వడ్లు కొనకుండా బీజేపీ రాజకీయ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు.
బీజేపీ నేతలు సొల్లు కబుర్లు చెప్పడం మానుకుని వడ్లు కొంటరా…కొనరో సూటిగా చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చారన్నారు. అలాగే రైతుల సాగునీటి కోసం కేసీఆర్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. అలాగే రైతుల ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ చేస్తోందని గుర్తుచేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 50 వేల కోట్ల రైతుల ఖాతాల్లో నేరుగా జమచేసినట్లు వివరించారు. అలాగే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించినట్లు గుర్తుచేశారు. రైతుల కోసం సీఎం చేయాల్సింది చేశారని.. అయితే ట కొనాల్సిన కేంద్రం చేతులెత్తేస్తోందని ఆరోపించారు. అయితే తెలంగాణ రైతు ఆగం కావాలి.. ఆ కోపం టీఆర్ఎస్ మీద వస్తే రాజకీయంగా లబ్ధి పొందుదామని బీజేపీ నేతలు కుట్రు పన్నుతున్నారని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వానికి దేశ రక్షణ, విదేశీ విధానంతో పాటు ఫుడ్ సేఫ్టీ బాధ్యత కూడా ఉందన్నారు. పంటలు పండిన చోట ధాన్యాన్ని కొనుగోలు చేసి.. పండని చోట, ప్రకృతి విలయాలు ఏర్పిడన చోట ప్రజల అవసరాల మేరకు ధాన్యాన్ని అందుబాటులో ఉంచడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు. పంటలు పండించడం రాష్ట్రం బాధ్యత, దాన్ని కొనే బాధ్యత కేంద్రానిదని స్పష్టంచేశారు. కేంద్రం ధాన్యం కొనదు కాబట్టే.. కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టంచేశారు. వడ్లు పండిస్తే రైతు నష్టపోకూడదనే సీఎం కేసీఆర్.. వడ్డు పండించొద్దని, ప్రత్నామ్నాయపంటలు వేయండని కోరుతున్నట్లు చెప్పారు.
Protest against the anti-farmers policies of the BJP government at the Centre.
#ChavuDappu #AntiFarmerBJP pic.twitter.com/awJQOBai4x— Harish Rao Thanneeru (@trsharish) December 20, 2021
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ రైతుల మీద ప్రేమ ఉంటే మీ ప్రధానిని ఒప్పించి యాసంగిలో వడ్లు కొంటవా? కొనవా? ముందుగా చెప్పాలని హరీశ్ రావు ప్రశ్నించారు. ముందుగా ధాన్యం కొనిపించి మాట్లాడాలని.. ఆయన సొల్లు పురాణం వినేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. రైతు వ్యతిరేక బీజేపీకి ప్రజలు గుణ పాఠంచెప్పాలన్నారు. బీజేపీ రైతుల ఉసురు పోసుకుని కార్పొరేట్ వర్గాలకు లాభం చేస్తోందని..బడా బడా కంపెనీలకు కొమ్ము కాస్తుందని ధ్వజమెత్తారు.
Protest against the anti-farmers policies of the BJP government at the Centre. #ChavuDappu #AntiFarmerBJP https://t.co/G8SgDtGy7L
— Harish Rao Thanneeru (@trsharish) December 20, 2021
Also Read..
Shocking: యూట్యూబ్‌లో చూస్తూ భార్యకు డెలివరీ.. చివరకు ఊహించని విషాదాంతం