TRS Delhi Office: హస్తినలో గులాబీ బావుటా.. తెలంగాణ రాజకీయ చరిత్రలో మరో చారిత్రక అధ్యాయానికి మరో 3 రోజులే..

|

Aug 29, 2021 | 7:35 PM

తెలంగాణ రాజకీయ చరిత్రలో మరో చారిత్రక అధ్యాయాన్ని లిఖించేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్‌విహార్‌లో పార్టీ

TRS Delhi Office: హస్తినలో గులాబీ బావుటా.. తెలంగాణ రాజకీయ చరిత్రలో మరో చారిత్రక అధ్యాయానికి మరో 3 రోజులే..
Kcr
Follow us on

TRS Party – Delhi Office – September 2nd: తెలంగాణ రాజకీయ చరిత్రలో మరో చారిత్రక అధ్యాయాన్ని లిఖించేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్‌విహార్‌లో పార్టీ కార్యాలయ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి తొలిసారిగా ఒక ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో ఆఫీసు ఉండబోతోంది. అంతేకాదు, ఢిల్లీలో పార్టీ కార్యాలయ ఏర్పాటుతో టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించబోతోంది.

హస్తినలో గులాబీ పార్టీ కార్యాలయ నిర్మాణానికి పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సెప్టెంబర్‌ 2వ తేదీన భూమి పూజ చేయనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లోని ఏ పార్టీకి లేని విధంగా ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీకి శాశ్వత భవన నిర్మాణం కాబోతుంది. ద్వి దశాబ్ది వేడుకలను పూర్తిచేసుకుంటున్న టీఆర్‌ఎస్‌ పార్టీ తన భవిష్యత్తు రాజకీయ వ్యూహానికి పదునుపెట్టే దిశగా అడుగులు వేస్తోంది.

తెలుగు నేల నుంచి పుట్టి.. ఢిల్లీ లో శాశ్వత రాజకీయ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోబోతున్న తొలి పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. దేశ రాజకీయాల్లో స్థిరమైన, బలమైన రాజకీయపార్టీగా భవిష్యత్తు బాట నిర్మించుకోవడంలో టీఆర్‌ఎస్‌ నిమగ్నమవుతోంది. ఇక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం కేంద్ర ప్రభుత్వం 2020 అక్టోబర్ 9న 1100 చదరపు మీటర్ల స్థలం కేటాయించిన సంగతి తెలిసిందే.

Read also: Vijayawada Durga Temple: ఆలయాల్లో రియాల్టీ చెక్ చేపట్టిన టీవీ9 కెమెరాకి చిక్కిన విస్తుపోయే వాస్తవాలు