Vanama Raghava: ఎట్టకేలకు వనమా రాఘవ అరెస్ట్‌.. కొత్తగూడెం తరలిస్తున్న పోలీసులు..

|

Jan 06, 2022 | 4:36 PM

Vanama Raghava Arrested: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు తెలంగాణలో ప్రకంపనలు సృష్టించింది. బాధిత కుటుంబం

Vanama Raghava: ఎట్టకేలకు వనమా రాఘవ అరెస్ట్‌.. కొత్తగూడెం తరలిస్తున్న పోలీసులు..
Vanama Raghava
Follow us on

Vanama Raghava Arrested: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు తెలంగాణలో ప్రకంపనలు సృష్టించింది. బాధిత కుటుంబం ఆత్మహత్యకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేందర్ రావు కారణమని.. రామకృష్ణ సూసైడ్ నోట్ రాయడంతో పాటు వీడియో కూడా రికార్డు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం రాజకీయాలను హీటెక్కిస్తోంది. ఎమ్మెల్యే కొడుకు అయి ఉండి.. ఇంత నీచానికి పాల్పడుతాడా? అంటూ విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. దీనికి సంబంధించి రాఘవను అరెస్ట్ చేసి.. ఏ1 గా ప్రకటించాలని.. ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. అధికార ప్రలోభాలకు తలొగ్గే పోలీసులు రాఘవను అరెస్ట్ చేయలేదంటూ పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిన్నటి నుంచి పోలీసులు రాఘవ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు బహిరంగ లేఖ రాశారు. చట్టానికి, విచారణకు రాఘవ సహకరిస్తాడని తెలిపారు. తన కుమారుడు సహకరించేలా బాధ్యత తీసుకుంటానని లేఖలో స్పష్టంచేశారు. పార్టీకి నియోజకవర్గానికి రాఘవేంద్రను దూరం పెడుతాననని.. నిర్దోషిగా అయ్యేంతవరకు రాజకీయాల్లో తలదూర్చడని చెప్పారు.

ఈ క్రమంలో ఎట్టకేలకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. రాఘవను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం రాఘవను కొత్తగూడేనికి తరలిస్తున్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు వెళుతుండాగా రాఘవను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వనమా వెంకటేశ్వరరావు సూచనలతో పోలీసులు వనమా రఘవాను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read:

Viral news: కొవిడ్‌ వ్యాక్సిన్‌ గురించి ఆలుమగల మధ్య గొడవ.. పిల్లల్ని కిడ్నాప్‌ చేసిందని భార్యపై భర్త ఫిర్యాదు..

Suryapet: భార్యతో వివాహేతర సంబంధం! కోపం పట్టలేక.. దమ్ము చక్రాలతో నుజ్జునుజ్జుగా తొక్కించాడు..