Income Tax Raid: రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్న వేళ మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు..ఏమన్నారంటే..?

|

Nov 22, 2022 | 1:53 PM

తెలంగాణ అధికార పార్టీలోని పలువురు నాయకుల ఇళ్ల మీద, వారి బంధువుల ఇళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు చేయడం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తెరాస నాయకుడు..

Income Tax Raid: రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్న వేళ మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు..ఏమన్నారంటే..?
Malla Reddy And Talasani Sr
Follow us on

తెలంగాణ అధికార పార్టీలోని పలువురు నాయకుల ఇళ్ల మీద, వారి బంధువుల ఇళ్లలో కేంద్ర దర్యాప్తు  సంస్థలు  సోదాలు చేయడం కొనసాగిస్తూనే ఉన్నారు.  ఈ నేపథ్యంలో తెరాస నాయకుడు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమపై జరుగుతున్న కేంద్ర సంస్థల దాడులను ముందుగానే ఊహించామని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలా టార్గెట్ చేసుకుని దాడి చేస్తున్నారని అన్నారు. ‘‘రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు ఊహించినవే. ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలే కానీ.. ఇలా టార్గెట్‌గా దాడులు చేయడం సరికాదు. ఈ తాటాకు చప్పుళ్లకు టీఆర్ఎస్ నాయకులు భయపడేది లేదు. మేమేంటో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామ’’ని తలసాని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఓ వైపు మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ దాడులు జరుగుతున్న వేళ హైదరాబాద్ జిల్లా పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక చోటకు చేరి సమావేశం కావడం సర్వత్రా ఆసక్తి రేపింది. అయితే ఈ మీటింగ్‌ కేవలం తెరాస పార్టీని బలోపేతం చేసే విషయాలపైనే చర్చించినట్లు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న దాడులు ఊహించినవే అని ఆయన తెలిపారు.

కాగా, హైదరాబాద్‌లో మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఐటీ శాఖ సోదాలు దాదాపు 6 గంటలుగా కొనసాగుతునే ఉన్నాయి. మల్లారెడ్డితో పాటు కుమారుడు, అల్లుడు, వియ్యంకుడి ఇళ్లలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. బోయినపల్లిలో మల్లారెడ్డి నివాసం, కొంపల్లిలో నివాసముంటున్న ఆయన కుమారుడు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో 50 బృందాలు తనిఖీలు చేపట్టాయి. అంతేకాక ఆయనకు చెందిన మల్లారెడ్డి విద్యాసంస్థలలో కూడా ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..