Thummala Nageswara Rao Comments: మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి హాట్‌హాట్ కామెంట్స్ చేశారు. తుమ్మల కామెంట్స్ ఇప్పుడు ఖమ్మం రాజకీయాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ కక్షలు, కార్పణ్యాలకు పోలేదంటూ మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం (Khammam) జిల్లా అభివృద్ధి కోసం పలు ప్రాజెక్టులు తీసుకొచ్చామని, కానీ ఇప్పుడు ఒకేపార్టీలో ఉన్నప్పటికీ ఇబ్బందులకు గురిచేస్తున్నారని తుమ్మల అసంతృప్తి వ్యక్తం చేశారు. చిల్లర వ్యక్తులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ మాజీమంత్రి తుమ్మల ఫైర్ అయ్యారు. చిల్లర వ్యక్తులు కవ్వించినా సంయమనం పాటించాలని తన అనుచరులు, కార్యకర్తలకు సూచించారు. చిల్లర వ్యక్తులతో తలపడితే తమ పరువు, ప్రతిష్టలే దెబ్బతింటాయని టీఆర్‌ఎస్ సీనియర్ నేత పేర్కొన్నారు. చిల్లర వ్యక్తుల సంగతి పార్టీ అధిష్టానం చూసుకుంటుందని, రాజకీయాల్లో ఓపిక అవసరమని చెప్పారు. ఎంత ఓపిక పడితే అంత మంచి జరుగుతుందన్నారు తుమ్మల నాగేశ్వరరావు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. అందరికీ తాను అండగా ఉంటానని తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు.
ఇప్పటికే ఖమ్మం జిల్లా టీఆర్ఎస్‌లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. తాజా, మాజీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. తుమ్మల అనుచరుడు, మాజీ కార్పొరేటర్ భాస్కర్ అరెస్టుతో ఈ వివాదం మరింత రాజుకుంది.
Also Read: