Harish vs Etela: టీఆర్ఎస్ గెలిస్తే అభివృద్ధి, సంక్షేమం.. ఈటల‌ గెలిస్తే ఏం చేస్తారో అడగండి, ఓటమి భయంతో అరేయ్ అంటున్నారు: హరీశ్ రావు

|

Aug 11, 2021 | 5:46 PM

హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలిస్తే అభివృద్ధి, సంక్షేమం.. ఈటల‌ గెలిస్తే ఏం చేస్తారో అడగండి అని హుజురాబాద్ ప్రజల్ని కోరారు మంత్రి హరీశ్ రావు. ఈటల ఓటమి భయంతో తండ్రి లాంటి కేసీఆర్‌ను,

Harish vs Etela: టీఆర్ఎస్ గెలిస్తే అభివృద్ధి, సంక్షేమం.. ఈటల‌ గెలిస్తే ఏం చేస్తారో అడగండి, ఓటమి భయంతో అరేయ్ అంటున్నారు: హరీశ్ రావు
Harish Rao
Follow us on

Etela vs Harish Rao: హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలిస్తే అభివృద్ధి, సంక్షేమం.. ఈటల‌ గెలిస్తే ఏం చేస్తారో అడగండి అని హుజురాబాద్ ప్రజల్ని కోరారు మంత్రి హరీశ్ రావు. ఈటల ఓటమి భయంతో తండ్రి లాంటి కేసీఆర్‌ను, తనను అరేయ్.. ఒరేయ్ అంటున్నారని హరీశ్ రావు విమర్శించారు. ఇవాళ హుజురాబాద్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్ రావు హాట్ కామెంట్స్ చేశారు.

బీజేపీలో చేరిన తర్వాత ఈటల కొత్త భాష నేర్చుకుంటున్నారని హరీశ్ అన్నారు. తనకు అన్నం పెట్టి, అక్షరాలు నేర్పి, ఇన్ని పదవులిచ్చిన కేసీఆర్ ను పట్టుకుని “రా” అని సంబోధిస్తున్నాడని తెలిపారు. అతనిలా.. తాను సంస్కారం తగ్గించుకోవాలనుకోవడంలేదన్నారు. ఆస్తుల కోసం వామపక్ష భావాలను, సిద్ధాంతాలను వదులుకుని బీజేపీలో చేరారన్నారు హరీశ్. “నీ భాష మారినా.. మేము మాత్రం నిన్ను రాజేందర్ గారూ అనే సంబోదిస్తాం” అని హరీశ్ అన్నారు. “నీవు అట్లా మాట్లాడావంటే..నీలో ఓటమి ప్రస్టేషన్ కనిపిస్తోందని మాకు అర్థమైంది” అని హరీశ్ వ్యాఖ్యానించారు.

“సీఎం గారి ఆశీస్తులతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమని హరీశ్ జోస్యం చెప్పారు. ప్రజలు‌ కోరుకునేది అభివృద్ధి, సంక్షేమం. టీఆర్ఎస్ గెలిస్తే అభివృద్ధి, సంక్షేమం. ఈటల‌ గెలిస్తే ఏం చేస్తారో అడగండి. అంటూ హరీశ్ హుజురాబాద్ ప్రజల్ని అడిగారు. హుజురాబాద్‌లో రాజేందర్ గెలిస్తే.. ఒక్క వ్యక్తిగా ఆయన గెలుస్తాడు. ప్రజలుగా మీరంతా ఓడిపోతారన్నారు మంత్రి హరీశ్ రావు. మీరు గెలుస్తారా? ఆయనను వ్యక్తిగా గెలిపిస్తారా? అని ప్రజల్ని ప్రశ్నించారు. బీజేపీలో చేరగానే ఈటల పని అయిపోయిందన్న హరీశ్.. హుజురాబాద్‌లో అభివృద్ధి కొనసాగాలంటే TRS ను గెలిపించాలన్నారు.

Read also: Mobile Apps Cheating: యాప్‌లతో బి కేర్‌ ఫుల్.! RCC ఆన్ లైన్ యాప్‌తో కడప జిల్లాలో 15 కోట్ల రూపాయల మోసం