TRS vs BJP: తెలంగాణ వర్సెస్ కేంద్రం.. ప్రస్తుతం రెండింటి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నీతి ఆయోగ్ (Niti Aayog) సెంటర్ పాయింట్‌గా జరుగుతోన్న వార్ ఇప్పుడు తెలంగాణలో కాకరేపుతోంది. ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తుంటే.. ఎన్నో ఇచ్చాం, మీరే యూజ్ చేసుకోలేదంటూ కేంద్రం కౌంటర్ ఇస్తోంది. నీతి ఆయోగ్ టార్గెట్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హాట్ కామెంట్స్‌కు అంతే దీటుగా రిప్లై ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలహీనంగా ఉన్నంతవరకు కేంద్రం, నీతి ఆయోగ్ మంచిదే. బీజేపీ బలపడటంతో.. అధికారం చేజారిపోతుందనే భయంతో ఇప్పుడు విమర్శలు చేస్తున్నారంటూ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. నిధులు ఇచ్చినా వినియోగించుకోవడం లేదని.. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
హరీశ్ ఆగ్రహం..
సీఎం కేసీఆర్ ఆరోపణలకు కొనసాగింపుగా సెంట్రల్ అండ్ నీతి ఆయోగ్‌పై రాష్ట్రమంత్రి మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. ఇష్టానుసారంగా సెస్‌లు పెంచేసి రాష్ట్రాలకు రావాల్సిన వాటాను రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర విధానాల కారణంగా వేలకోట్ల నిధులు రాకుండా ఆగిపోయాయంటూ హరీశ్ రావు మోడీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు.
కిషన్ రెడ్డి కౌంటర్..
అయితే, కావాల్సినన్ని నిధులు ఇచ్చాం, రాష్ట్రమే వినియోగించుకోవడం లేదనేది కేంద్రం కామెంట్. అంకెల గారడీ చేస్తోందనేది తెలంగాణ ఇస్తున్న కౌంటర్. మొత్తానికి నీతి ఆయోగ్ మీటింగ్ టైమింగ్‌ను యూజ్ చేసుకుని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేస్తే,.. ఘాటు కౌంటర్లతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బదులిచ్చారు. మరి, ఈ మాటల యుద్ధం ఇంతటితో ఆగుతుందో, లేక కంటిన్యూ అవుతుందో.. వేచి చూడాల్సిందే.