Huzurabad By Election: హుజురాబాద్ పొలిటికల్‌ లీగ్‌లో మరో ఇంట్రెస్టింగ్ డెవలప్‌మెంట్

|

Oct 11, 2021 | 7:30 PM

హుజురాబాద్‌లో 42 మంది. బద్వేల్‌లో 18 మంది. నామినేషన్ల స్క్రూటినీ తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య ఇది. ఉపసంహరణకు మరో రెండు రోజుల టైమ్ ఉంది.

Huzurabad By Election: హుజురాబాద్ పొలిటికల్‌ లీగ్‌లో మరో ఇంట్రెస్టింగ్ డెవలప్‌మెంట్
Huzurabad By Poll
Follow us on

Huzurabad By Election: హుజురాబాద్‌లో 42 మంది. బద్వేల్‌లో 18 మంది. నామినేషన్ల స్క్రూటినీ తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య ఇది. ఉపసంహరణకు మరో రెండు రోజుల టైమ్ ఉంది. ఆ తర్వాతే ఎంత మంది పోటీలో ఉంటరాన్నదానిపై క్లారిటీ రానుంది. అయితే, ఇక్కడొక హుజురాబాద్ పొలిటికల్‌ లీగ్‌లో మరో ఇంట్రెస్టింగ్ డెవలప్‌మెంట్. నామినేషన్ల పరిశీలన ముగిసింది. మొత్తం 61 అభ్యర్థులు పత్రాలు సమర్పించగా 19 తిరస్కరణకు గురయ్యాయి. అంటే 42 మంది బరిలో నిలిచారు. వీళ్లంతా చివరి వరకూ పోటీలో నిలిస్తే తలనొప్పులు తప్పకపోవచ్చు. జంబో ఈవీఎంలను ఏర్పాటు చేయాల్సి వస్తుంది.

అయితే ఉపసంహరణకు మరో రెండు రోజుల గడువు ఉంది. దీంతో ఇండిపెండెంట్‌ అభ్యర్థులను బుజ్జగించి.. నామినేషన్లను ఉపసంహరింపచేసే ప్రయత్నాల్లో ఉన్నాయి పార్టీలు. అటు ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు ఇప్పటికే ఆమోదం పొందాయి. టీఆర్ఎస్‌ నుంచి గెల్లు శ్రీనినాస్, బీజేపీ నుంచి ఈటల, కాంగ్రెస్ తరపున బల్మూరి వెంకట్ బరిలో నిలిచారు. సరైన పత్రాలు సమర్పించని కారణంగా రాజేందర్‌ పేరుతో దాఖలైన 3 నామినేషన్లను తిరస్కరించారు అధికారులు.

పోలింగ్ డేట్ దగ్గర పడుతుండటంతో పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోంది. విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఇల్లంతకుంట మండలంలోని రాచపల్లి గ్రామంలో టీఆరెస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రచారం చేశారు. మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

బద్వేల్‌లోనూ నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. స్క్రూటినీ తర్వాత 18 మంది బరిలో నిలిచారు. 9 నామినేషన్లను తిరిస్కరించారు. ఈ ఉపఎన్నికలో మొత్తం 27 మంది క్యాండిడేట్లు 35 సెట్ల నామినేషన్లు వేశారు. వైసీపీ నుంచి డాక్టర్ సుధ, బీజేపీ నుంచి సురేష్, కాంగ్రెస్ నుంచి కమలమ్మ పోటీ చేస్తున్నారు. అటు ఎవరెన్ని కుట్రలు చేసినా బద్వేల్‌లో తమ గెలుపు ఖాయమన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

ప్రస్తుతానికైతే అటు హుజురాబాద్, ఇటు బద్వేల్‌ రెండు చోట్లా ఇండిపెండెంట్లు భారీగా నామినేషన్లు వేశారు. ఉపసంహరణ తర్వాత ఫైనల్ లిస్ట్‌పై క్లారిటీ వస్తుంది. పోలింగ్ ఈనెల 30న కౌటింగ్ నవంబర్ 2న ఉంటుంది.

Read also: MAA Reactions: ‘మా’ ఫలితాల తర్వాత రియాక్షన్లు.. లేదంటే, తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామంటూ హెచ్చరికలు