బ్రేకింగ్.. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన టీఆర్ఎస్ కార్యకర్త

సూర్యపేట పట్టణంలో మేయర్ ఎన్నిక ఉద్రిక్తతకు దారి తీసింది. స్థానిక 5 వార్డ్‌ కౌన్సిలర్‌ బాష ఇంట్లో ఓ టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఒకరు హల్‌చల్‌ చేశాడు. బాషాకు వైస్‌ చైర్మన్‌ పదవి రాలేదని మనస్తాపం చెందిన ధరావత్‌ సూరి అనే కార్యకర్త.. తన ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. అయితే పెట్రోల్ పోసుకోవడాన్ని అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు గుర్తించి వెంటనే అతన్ని అడ్డుకున్నారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఏకగ్రీవంగా ఎన్నికైన బాషకు వైస్ […]

బ్రేకింగ్.. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన టీఆర్ఎస్ కార్యకర్త

Edited By:

Updated on: Jan 29, 2020 | 12:23 PM

సూర్యపేట పట్టణంలో మేయర్ ఎన్నిక ఉద్రిక్తతకు దారి తీసింది. స్థానిక 5 వార్డ్‌ కౌన్సిలర్‌ బాష ఇంట్లో ఓ టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఒకరు హల్‌చల్‌ చేశాడు. బాషాకు వైస్‌ చైర్మన్‌ పదవి రాలేదని మనస్తాపం చెందిన ధరావత్‌ సూరి అనే కార్యకర్త.. తన ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. అయితే పెట్రోల్ పోసుకోవడాన్ని అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు గుర్తించి వెంటనే అతన్ని అడ్డుకున్నారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఏకగ్రీవంగా ఎన్నికైన బాషకు వైస్ చైర్మన్ పదవి దక్కుతుందని ఆశిస్తే.. పార్టీ అతనికి కాకుండా వేరే వారికి ఇచ్చిందని ఆరోపిస్తూ.. ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డాడు.