Telangana TMC: యువర్ అటెన్షన్ ప్లీజ్..! తెలంగాణ పొలిటికల్ పట్టాలపైకి దీదీ ఎక్స్‌ప్రెస్ దూసుకొస్తోంది

|

Oct 08, 2021 | 8:05 PM

యువర్ అటెన్షన్ ప్లీజ్..! కృపయా ధ్యాన్‌ దే..! తెలంగాణ పొలిటికల్ పట్టాలపైకి దీదీ ఎక్స్‌ప్రెస్ దూసుకొస్తోంది. అవును.. ఇప్పటికే మంచి కాకమీదున్న తెలంగాణ రాజకీయాల్లో మరో హైవోల్టేజ్ డెవలప్‌మెంట్.

Telangana TMC: యువర్ అటెన్షన్ ప్లీజ్..! తెలంగాణ పొలిటికల్ పట్టాలపైకి దీదీ ఎక్స్‌ప్రెస్ దూసుకొస్తోంది
Telangana Tmc
Follow us on

Telangana Trinamool Congress: యువర్ అటెన్షన్ ప్లీజ్..! కృపయా ధ్యాన్‌ దే..! తెలంగాణ పొలిటికల్ పట్టాలపైకి దీదీ ఎక్స్‌ప్రెస్ దూసుకొస్తోంది. అవును.. ఇప్పటికే మంచి కాకమీదున్న తెలంగాణ రాజకీయాల్లో మరో హైవోల్టేజ్ డెవలప్‌మెంట్. మరో పార్టీకి ఇక్కడ స్కోప్‌ ఉందా? సక్సెస్ అవుతుందా..? ఆమె వెంట నడిచేదెవరు? చేరేదెవరన్నది పక్కన పెడితే..ప్రస్తుతానికి ఈ ఇష్యూ ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారింది.

దీదీ.. ఆమె రూటే సపరేటు. మొండిగా ముందుకెళ్లే నైజం. కొండనైనా ఢీకొట్టగల సత్తా.! వామపక్షాల్ని ఊడ్చేసింది. కమలాన్ని కకావికలం చేసింది. బెంగాల్‌లో హ్యాట్రిక్ కొట్టింది. ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్‌పై ఫోకస్ చేస్తోంది. BJPని ఢీకొట్టేందుకు సై అంటోంది. ఢిల్లీలో కాలుమోపేందుకు స్కెచ్ ప్రిపేర్‌ చేస్తోంది. అందుకే పార్టీ విస్తరణపై దృష్టిసారిస్తోంది TMC అధినేత్రి మమతా బెనర్జీ. ఈశాన్య రాష్ట్రాలతోపాటు..సౌత్‌ స్టేట్స్‌లోనూ పాగా వేసేందుకు సైలెంట్‌గా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది..

BJPని ఎదుర్కోవడం కాంగ్రెస్ వల్ల కావడం లేదు. మేమే సరైన ప్రత్యామ్నాయం. ఇదే ఇష్యూని మెయిన్‌గా ప్రొజెక్ట్ చేస్తోంది మమతా బెనర్జీ. అందుకే వివిధ రాష్ట్రాల్లోని పొలిటికల్ సిట్యుయేషన్స్‌ని కీన్‌గా అబ్జర్వ్ చేస్తోంది. ఇప్పటికే ఈశాన్యరాష్ట్రాల్లో బలపడేలా ప్లానింగ్ రూపొందించారు. ఇటు త్వరలో ఎన్నికలు జరిగే గోవాపైనా ఫోకస్ చేశారు. ఇప్పటికే బలమైన నేతల్ని పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు హౌరా టు చార్మినార్‌ వచ్చేస్తోంది దీదీ ఎక్స్‌ప్రెస్‌.

జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన TMC అవకాశం ఉన్న ప్రతిరాష్ట్రంలో కేడర్‌ను డెవలప్‌ చేయాలని చూస్తోంది. అందులో భాగంగానే తెలంగాణలో ఉన్న మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో TMC పార్లమెంట్‌ సభ్యుల బృందం ఒకటి చర్చలు జరుపుతోంది. సొంత పార్టీల్లో అసంతృప్తిగా ఉన్నవాళ్లు.. ఏ పార్టీలో లేకుండా అవకాశాల కోసం చూస్తున్న నాయకులతో మంతనాలు జరుగుతున్నాయట. తమ పార్టీలో చేరి పోటీకి ముందుకొస్తే పదవులతో పాటు.. ఎన్నికల ఖర్చు అంతా భరిస్తామని భరోసా ఇస్తున్నారట. ఇందులో భాగంగా ఇప్పటికే ముగ్గురు, నలుగురు నేతలకు టచ్‌లోకి వెళ్లి మరీ ఆఫర్‌ చేశారట. ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల నేతలకు టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే వాళ్ల నుంచి పెద్దగా స్పందన లేదని చెబుతున్నారు.

చిన్నరాష్ట్రాలు.. తక్కువ పార్లమెంట్‌ సభ్యులు జాతీయ పార్టీల ప్రభావం ఉన్న రాష్ట్రాల్లోనే TMC ఫోకస్‌ పెట్టింది. ఏపీ వంటి ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న స్టేట్స్‌ లో కష్టమని భావించి గోవా, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో రంగంలో దిగుతోంది. స్థానికంగా ఉండే నాయకుల బలంతో అక్కడక్కడా ఒక్కసీటు గెలుచుకున్నా చాలన్న ఉద్దేశంలో ఉంది. ముఖ్యంగా PM రేసులో ఉన్న మమత.. ఇతర రాష్ట్రాల్లో కూడా సీట్లు గెలిస్తే తనకు దేశవ్యాప్తంగా ప్రజల మద్దతు ఉందన్న భావన కల్పించవచ్చని భావిస్తోందట.

తెలంగాణ విషయానికొస్తే.. గతంలో కూడా పలు పార్టీలు ఇక్కడ అడుగుపెట్టాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 2014లో BSP నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. నిర్మల్‌ నుంచి ఇంద్రకరణ్‌ రెడ్డి, కాగజ్‌నగర్‌ నుంచి కోనేరు కోనప్ప మాయావతి సారధ్యంలోని BSP సింబల్‌తో గెలిచారు. అంతకుముందు 2004లో డీకే అరుణ కూడా MLAగా సమాజ్‌ వాదీ పార్టీ తరపున పోటీచేసి విజయం సాధించారు. తర్వాత పార్టీ కనుమరుగు అయినా.. ప్రస్తుతం మళ్లీ 2023 లక్ష్యంగా మాజీ IPS అధికారి RS ప్రవీణ్‌ కుమార్‌ సారధ్యంలో BSP రంగంలో దిగుతోంది. అటు షర్మిలా కూడా కొత్తగా పార్టీ స్టార్‌ చేశారు. ఇప్పుడు లేటెస్టుగా TMC కూడా ఎంట్రీ ఇస్తుండటంతో తెలంగాణలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. మరి దీదీ ఎక్స్‌ప్రెస్‌..తెలంగాణలో ఏమేరకు దూసుకెళ్తుందో చూడాలి.!

Read also:  Girl Kidnap: బ్రేకింగ్: నిజామాబాద్‌ షాపింగ్ మాల్‌లో చిన్నారి అపహరణ.. సీసీ టీవీ విజువల్స్