తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,210 ఉపాధ్యాయులు, అధ్యాపకుల పోస్టుల భర్తీకి రాత పరీక్షల నిర్వహణపై నియామక బోర్డు కసరత్తు చేస్తోంది. ఆగస్టు లేదా సెప్టెంబరులో రాతపరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కేటగిరీలు వారీగా, సబ్జెక్టుల వారీగా పరీక్షలకు సంబంధించిన వివరణాత్మక షెడ్యూల్ బోర్డు త్వరలో ప్రకటించనుంది. ఇతర పోటీ పరీక్షల తేదీలకు అడ్డంకులు లేకుండా పరీక్షల తేదీలను ఖరారు చేయనుంది.
కాగా తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో 9 నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్న 9,210 టీచర్ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.66 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా టీజీటీ, పీజీటీ పోస్టులకు కలిపి 1.6 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పీజీటీ, టీజీటీ పోస్టుల్లోనూ కొన్ని సబ్జెక్టులకు 35 వేలలోపు వచ్చాయి. నియామక పరీక్ష ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని గురుకుల నియామక బోర్డు నిర్ణయించింది. ఈ క్రమంలో సెప్టెంబరులోగా పరీక్షలు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.