AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అతనికి పెళ్లై ముగ్గురు పిల్లలున్నారు.. మైనర్‌‌తో చెట్టాపట్టాల్.. చివరకు లాడ్జిలో..

వివాహేతర సంబంధాలతో ప్రాణాలు పోతున్నా.. మనుషుల్లో మాత్రం మార్పు రావడం లేదు. పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తి 16 ఏళ్ల బాలికతో ప్రేమాయణం సాగించాడు. పోక్సో కేసులో అరెస్టై జైలుకు వెళ్లినా అతనిలో మార్పు రాలేదు. ఓ రోజు లాడ్జికి వెళ్లిన జంట కఠిన నిర్ణయం తీసుకుంది.

Telangana: అతనికి పెళ్లై ముగ్గురు పిల్లలున్నారు.. మైనర్‌‌తో చెట్టాపట్టాల్.. చివరకు లాడ్జిలో..
Tragedy In Bhadrachalam
N Narayana Rao
| Edited By: |

Updated on: Sep 05, 2025 | 10:07 PM

Share

అతనికి 35.. మైనర్ బాలికకు 16 ఏళ్లు.. లాడ్జిలో శవాలై కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటన భద్రాచలంలో జరిగింది. మైనర్ బాలికతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అతడు.. ఆమెతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. అశ్వాపురం మండలానికి చెందిన 16 ఏళ్ల బాలికకు, కుకునూరు మండలం రావిగూడెం గ్రామానికి చెందిన 35 ఏళ్ల రవికి మధ్య కొన్ని రోజులుగా ప్రేమాయణం నడుస్తోంది. రవికి ఇప్పటికే పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ విషయంపై గతంలో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రవిని జైలుకు పంపించారు. రెండు నెలలు జైలులో ఉన్న రవి, బయటకు వచ్చాక కూడా తన తీరు మార్చుకోలేదు.

జైలు జీవితం తర్వాత కూడా రవి తన భార్య, పిల్లలను పట్టించుకోకుండా, అదే సంబంధాన్ని కొనసాగించాడు. కుటుంబంలో గొడవలు జరుగుతుండటంతో రవి, ఆ మైనర్ బాలికతో కలిసి భద్రాచలం చేరుకున్నాడు. అక్కడ ఒక ప్రైవేట్ లాడ్జిలో రెండు రోజులు గడిపిన తర్వాత ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు, వారిని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకు వెళ్లేలోపే రవి చనిపోయాడు. బాలిక కూడా ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన సమాజంలో వివాహేతర సంబంధాలు, మైనర్లతో సంబంధాలపై ఉన్న సమస్యలను మరోసారి గుర్తు చేస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వాట్సప్‌లో రీఛార్జ్ ఆప్షన్.. ఒక్క క్లిక్‌తో సెకన్లలోనే ప్రాసెస్..
వాట్సప్‌లో రీఛార్జ్ ఆప్షన్.. ఒక్క క్లిక్‌తో సెకన్లలోనే ప్రాసెస్..
వారెవ్వా.. ఏసీ నుంచి వచ్చే వేస్ట్‌ వాటర్‌తో ఇన్ని లాభాలా..?
వారెవ్వా.. ఏసీ నుంచి వచ్చే వేస్ట్‌ వాటర్‌తో ఇన్ని లాభాలా..?
అమావాస్య పేరు వెనుక రహస్యం ఏమిటి? పితృదేవతలతో ఉన్న సంబంధం..
అమావాస్య పేరు వెనుక రహస్యం ఏమిటి? పితృదేవతలతో ఉన్న సంబంధం..
ప్రకృతి ప్రసాదించిన వరం.. దీంతో పచ్చడి చేసుకోని తింటే..
ప్రకృతి ప్రసాదించిన వరం.. దీంతో పచ్చడి చేసుకోని తింటే..
అన్నదమ్ముల మధ్య వార్.. మధ్యలో దూరిన సిస్టర్.. వైరల్ అవుతున్న ఫోటో
అన్నదమ్ముల మధ్య వార్.. మధ్యలో దూరిన సిస్టర్.. వైరల్ అవుతున్న ఫోటో
వారెవ్వా.. 90 కి.మీ మైలేజ్‌తో సుజుకి నుంచి సూపర్ స్కూటీ..
వారెవ్వా.. 90 కి.మీ మైలేజ్‌తో సుజుకి నుంచి సూపర్ స్కూటీ..
ఆమె ఇండస్ట్రీకే మహారాణి.. అసలైన హీరోయిన్ ఆమె..
ఆమె ఇండస్ట్రీకే మహారాణి.. అసలైన హీరోయిన్ ఆమె..
సమ్మర్ స్పెషల్ ఆఫర్.. డెకాయిట్ సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గింపు
సమ్మర్ స్పెషల్ ఆఫర్.. డెకాయిట్ సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గింపు
రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి? దీంతో ఫుల్ ఎనర్జీ గ్యారంటీ!
రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి? దీంతో ఫుల్ ఎనర్జీ గ్యారంటీ!
బ్యాంకులో లోన్ విన్నాం కానీ.. ఈ ప్లేయర్ లోన్ ఏంటి బాసూ?
బ్యాంకులో లోన్ విన్నాం కానీ.. ఈ ప్లేయర్ లోన్ ఏంటి బాసూ?