Hyderabad Traffic Restrictions: హైదరాబాద్ లో గురువారం ట్రాఫిక్‌ ఆంక్షలు.. పోలీసుల సూచనలు..

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అశోక్ నగర్ బైబిల్ హౌస్ శోభాయాత్ర సమయంలో ఈ మూడు ప్రాంతాలు చాలా కీలకం.. బైబిల్ హౌస్ మీదుగా కవాడీ గూడా వెళ్లే వాహనాలను శోభాయాత్ర రోజు అనుమతించాం. ఆ ట్రాఫిక్ ను కర్బలా మైదాన్ గుండా మహంకాళి ట్రాఫిక్ మళ్లించబడుతుంది..

Hyderabad Traffic Restrictions: హైదరాబాద్ లో గురువారం ట్రాఫిక్‌ ఆంక్షలు.. పోలీసుల సూచనలు..
Hyderabad Traffic Restrictions

Updated on: Apr 05, 2023 | 8:36 PM

ఏప్రిల్‌ 6న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని పలు చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు అదనపు ట్రాఫిక్ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హనుమాన్ శోభాయాత్ర సవ్యంగా సాగేందుకు నగరవాసులు సహకరించాలని ఆయన కోరారు. శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి వాహనదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. ఉదయం 11 గంటలకు గౌలిగూడలోని రామ మందిరం నుండి శోభాయాత్ర ప్రారంభమవుతుందని, అఫ్జల్గంజ్ వైపు నుండి వచ్చే వాహనాలను ఎస్ఎ మస్జీద్ నుంచి ఎంజిబీఎస్ బస్టాండ్ వైపు మల్లింపబడుతుందన్నారు. రంగ మహల్ నుండి వచ్చే ట్రాఫిక్ ను సిబిఎస్ వైపు మళ్ళించబడుతుందని, మధ్యాహ్నం 12:30 గంటలకు యాత్ర కోటి ఆంధ్ర బ్యాంక్ సర్కిల్కు ఉంటుందన్నారు.

ఆ సమయంలో కోటి వైపు వచ్చే వాహనాలను చాదర్ఘాట్ ఎక్స్ రోడ్స్ వద్ద డైవర్ట్ చేసి నింబోలిఅడ్డ రంగ మహల్ వైపు మళ్ళించబడునన్నారు. కాచిగూడ వైపు నుండి వచ్చే ట్రాఫిక్కును లింగంపల్లి ఎక్స్ రోడ్ నుండి పోస్ట్ ఆఫీస్ రోడ్డు చప్పల్ బజార్ వైపు మళ్లించబడుతుందని, నారాయణా గుడా షాలిమార్ థియేటర్ వైపు వాహనాలు అనుమతించబడవన్నారు. ఆ ట్రాఫిక్ ను షాలిమార్ మీదుగా ఈడెన్ గార్డెన్ వైపు మళ్ళించబడునన్నారు. శోభాయాత్ర సమయంలో నారాయణగూడ ఫ్లైఓవర్ తెరిచే ఉంటుంది వాహనదారులు గమనించగలరని, అశోక్ నగర్ లో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కొనసాగుతుందని తెలిపారు.

అంతేకాకుండా.. శోభాయాత్ర సందర్భంగా నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిపివేశాము. గతంలో ఎక్కువ హైట్ లో డీజే లు పెట్టడం వల్ల అవి కూడా ట్రాఫిక్ జామ్ కు కారణం అయ్యాయి. ఈసారి నిర్వహకులకు నిర్ణీత ఎత్తులో డీజేలు అమర్చుకోవాలని సూచన చేసాము.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అశోక్ నగర్ బైబిల్ హౌస్ శోభాయాత్ర సమయంలో ఈ మూడు ప్రాంతాలు చాలా కీలకం.. బైబిల్ హౌస్ మీదుగా కవాడీ గూడా వెళ్లే వాహనాలను శోభాయాత్ర రోజు అనుమతించాం. ఆ ట్రాఫిక్ ను కర్బలా మైదాన్ గుండా మహంకాళి ట్రాఫిక్ మళ్లించబడుతుంది..

ఇవి కూడా చదవండి

హనుమాన్ శోభాయాత్ర రాత్రి 8 గంటల ప్రాంతంలో తాడ్ బండ్ హనుమాన్ దేవాలయం చేరుకుంటుందని భావిస్తున్నాం.. శోభాయాత్రలో ప్రత్యక్షంగా 750 మంది ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో ఉంటారు.. ట్రాఫిక్ క్రమబద్దికరణకు ట్రాఫిక్ పోలీసులతోపాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా పనిచేస్తారని ఆయన తెలిపారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం..