Hyderabad: ఎవరు భయ్యా నువ్వు.. స్కూటీపై ఇన్ని చలాన్‌లా.. నోరెళ్లబెట్టిన ట్రాఫిక్ పోలీసులు..!

హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘించేవారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా బంజారాహిల్స్‌లో నిర్వహించిన సాధారణ తనిఖీ ఒక ఆశ్చర్యకరమైన కేసును వెలుగులోకి వచ్చింది. సెల్‌ఫోన్‌ డ్రైవ్‌ చేస్తున్న ఒక యువకుడిని ఆపిన పోలీసులు.. అతని స్కూటీపై ఉన్న పెండింగ్‌ చాలాన్స్‌ చూసి నోరెళ్లబెట్టారు.

Hyderabad: ఎవరు భయ్యా నువ్వు.. స్కూటీపై ఇన్ని చలాన్‌లా.. నోరెళ్లబెట్టిన ట్రాఫిక్ పోలీసులు..!
Hyderabad

Edited By:

Updated on: Nov 25, 2025 | 3:58 PM

హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘించేవారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా బంజారాహిల్స్‌లో నిర్వహించిన సాధారణ తనిఖీ ఒక ఆశ్చర్యకరమైన కేసును వెలుగులోకి వచ్చింది. సెల్‌ఫోన్‌లో మాట్లాడుకుంటూ యాక్టివా స్కూటర్‌పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని ఆపిన ట్రాఫిక్‌ పోలీసులు వాహన నంబర్‌ను సిస్టంలో చెక్ చేస్తే… నోరెళ్లబెట్టే రీతిలో 42 పెండింగ్‌ చలాన్లు బయటపడ్డాయి.

సింగరేణి కాలనీ, సైదాబాద్‌కు చెందిన బి. ఆనంద్‌రాజు అనే వ్యక్తి యాక్టివా స్కూటర్‌తో కేబీఆర్ పార్క్ చౌరస్తా దాటుతుండగా ట్రాఫిక్ పోలీసులు అతన్ని ఆపారు. ఆ సమయంలో కూడా అతడు హెల్మెట్ లేకుండా, ఫోన్ చెవికి పెట్టుకుని బైక్ నడుపుతున్నాడు. దీంతో పోలీసులు ఆ వాహనంపై నమోదు అయిన చలాన్లను పరిశీలించగా ఒక్కసారిగా స్టన్ అయ్యారు. అతని బైక్‌పై మొత్తం 42 పెండింగ్ చలాన్లు ఉండటకం గమనార్హం.కాగా పెండింగ్ ఫైన్ మొత్తం రూ.16,665గా ఉంది. హెల్మెట్ లేకుండా బైక్ నడపడంతో 34 సార్లు అతనికి ఫైన పడింది. సెల్‌ఫోన్ డ్రైవింగ్ 4 సార్లు చేస్తూ పోలీసుల కెమెరాలకు చిక్కాడు. రాంగ్‌ రూట్‌లో సౌతం నాలుగుసార్లు పట్టుబడ్డాడు. ఇదంతా చూసిన ట్రాఫిక్ సిబ్బంది కూడా ఏకంగా ఆశ్చర్యపోయారని సమాచారం.

చట్టపరంగా చలాన్లు క్లియర్ చేయాలని పోలీసులు కోరినప్పటికీ, ఆనంద్‌రాజు చెల్లించబోనని స్పష్టంగా తెలిపాడు. దీంతో పోలీసులు వెంటనే అతడి యాక్టివా స్కూటర్‌ను సీజ్ చేసి, అతనిపై కేసు నమోదు చేశారు. సాధారణంగా చాలా మంది చలాన్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోరు. కెమెరాలకు చిక్కినా లెక్క చేయరు. కానీ ఒకసారి చెక్‌పోస్టులో వాహనం ఆగితే సీజ్ వరకు వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us