AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వాహనదారులకు గుడ్ న్యూస్.. మరో ఛాన్స్ ఇస్తూ రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం..

పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డిస్కౌంట్‌‌‌‌ ఆఫర్‌‌‌‌ గడువు ఈరోజు అర్థరాత్రితో ముగియనుంది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ చలాన్ల గడువును ఈ నెల 31వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గడువు దగ్గరపడటం.. చలానా చెల్లింపులు ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం తేదీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Telangana: వాహనదారులకు గుడ్ న్యూస్.. మరో ఛాన్స్ ఇస్తూ రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం..
Telangana Traffic Challans
Shaik Madar Saheb
|

Updated on: Jan 10, 2024 | 5:52 PM

Share

పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డిస్కౌంట్‌‌‌‌ ఆఫర్‌‌‌‌ గడువు ఈరోజు అర్థరాత్రితో ముగియనుంది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ చలాన్ల గడువును ఈ నెల 31వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గడువు దగ్గరపడటం.. చలానా చెల్లింపులు ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం తేదీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా.. గత నెల 26 నుంచి పెండింగ్‌ చలాన్లను క్లియర్‌ చేసుకునేందుకు ప్రభుత్వం రాయితీ కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్‌ చలాన్లు ఉండగా.. కోటికిపైగా చలాన్లు క్లియర్‌ అయినట్లు అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 113 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. అత్యధికంగా హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 66.57 లక్షల చలాన్లు క్లియర్‌ అయ్యాయి.

ఈ చలాన్లను మీసేవతో పాటు యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించే అవకాశం కల్పించింది. ఈ భారీ డిస్కౌంట్‌‌‌‌ ఆఫర్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. అయితే సర్వర్ సమస్యతో చలాన్లు కట్టలేకపోయామని.. మరోసారి గడవును పొడించాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ గడువు తేదీని పెంచింది.

ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై పెండింగ్‌లో ఉన్న చలాన్లపై 90 శాతం రాయితీని ప్రకటించగా, బైక్‌లపై 80 శాతం, ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలకు 50 శాతం తగ్గింపుతో భారీ రాయితీ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్