టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర స్టార్ట్ అయింది. మేడారం సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హాథ్ సే హాథ్ జోడో యాత్రను ప్రారంభించారు రేవంత్. పాదయాత్రలో మల్లురవి, ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఇవాళ కొత్తూరు, నార్లాపూర్, ప్రాజెక్టునగర్ మీదుగా పాదయాత్ర సాగనుంది. సాయంత్రం పస్రా గ్రామంలో రోడ్ షో నిర్వహిస్తారు. ఇక రాత్రి 8 గంటల ప్రాంతంలో రామప్ప గ్రామానికి చేరుకొని అక్కడే బస చేస్తారు. రేవంత్‌రెడ్డి మొదటి విడత పాదయాత్ర మొత్తం 50 నియోజకవర్గాల్లో కొనసాగే విధంగా రూట్‌మ్యాప్ రూపొందించారు. రాహుల్ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా , కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఆయా జిల్లాలో పాదయాత్రలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.
పాదయాత్రలో కాంగ్రెస్ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. బ్రహ్మాండంగా పాదయాత్ర సాగుతుందని వారు తెలిపారు. పాదయాత్రను ప్రజల యాత్రగా మారుస్తామని.. ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటామని కాంగ్రెస్ కార్యకర్తలు వెల్లడించారు. భారత్ జోడో యాత్రకు పొడిగింపుగా రేవంత్ ‘‘హాత్ సే హాత్ జోడో’’ కొనసాగుతుందని చెప్పారు.
ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా పాదయాత్రకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’ లో భాగంగా సోమవారం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు. రాష్ట్రంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ నిర్వహణపై ఠాక్రే నేతృత్వంలో శనివారం గాంధీభవన్‌లో ముఖ్యనేతల సమావేశం జరిగింది. రేవంత్ పాదయాత్ర మొత్తం రెండు నెలల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం