MP Revanth Reddy: నూతన సచివాలయానికి రేవంత్ రెడ్డి.. అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత..
ఔటర్ రింగ్ రోడ్డు లీజు అంశంపై ఫిర్యాదు చేసేందుకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్ అపాయింట్‌మెంట్ కోరారు రేవంత్‌రెడ్డి. అయితే ఆయన ప్రస్తుతం అందుబాటులో లేరు. అరవింద్ కుమార్ అందుబాటులో లేరు కాబట్టి సచివాలయానికి వెళ్లేందుకు అనుమతి లేదంటున్నారు పోలీసులు.
నూతన సచివాలయంకు బయలుదేరిన తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎంపీ రేవంత్‌రెడ్డిని పోలీసులు మధ్యలోనే అడ్డుకోవడం టెన్షన్ క్రియేట్ చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు లీజు అంశంపై ఫిర్యాదు చేసేందుకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్ అపాయింట్‌మెంట్ కోరారు రేవంత్‌రెడ్డి. అయితే ఆయన ప్రస్తుతం అందుబాటులో లేరు. అరవింద్ కుమార్ అందుబాటులో లేరు కాబట్టి సచివాలయానికి వెళ్లేందుకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. అందుకే రేవంత్‌రెడ్డిని టెలిఫోన్ భవన్ వద్దే అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. ORRపై ఫిర్యాదు కోసం స్పెషల్ CS అరవింద్ అనుమతి కోరారు రేవంత్‌రెడ్డి. అపాయింట్‌మెంట్ ఇచ్చిన అరవింద్ కుమార్ ఇప్పుడు అందుబాటులో లేకపవోడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవింద్ లేకపోవడంతో ఎవరికీ అనుమతి లేదంటున్నారు పోలీసులు.
అవసరమైతే పోలీసులు తనను సచివాలయానికి తీసుకెళ్లాలని అన్నారు. తనను సచివాలయానికి ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. తాను ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ల అవకతవకలపై అధికారిని కలిసి ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నానని చెప్పారు.
పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్‌రెడ్డి. ఒక ఎంపీగా ఎప్పుడైనా సచివాలయానికి వెళ్లే హక్కు తనకు ఉంటుందని.. ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.. అడ్డుకోమని ఎవరు ఆదేశించారో చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ రేవంత్ రెడ్డి.
ఔటర్ రింగ్‌రోడ్డుని ఇటీవలే 30 ఏళ్లపాటు లీజుకి ఇచ్చింది ప్రభుత్వం. 7 వేల 380 కోట్లకు టెండర్ వేసిన ముంబైకి చెందిన ఓ ప్రైవేట్ సంస్థ ఈ లీజుని దక్కించుకుంది. అయితే ఈ వ్యవహారంలో వెయ్యి కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపిస్తున్నారు రేవంత్ రెడ్డి. ORRను 30 ఏళ్ల పాటు లీజుకిస్తే దాదాపు 30 వేల కోట్ల ఆదాయం వస్తుందన్నది కాంగ్రెస్ వర్షన్.
ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్భన్ డెలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేయాలని రేవంత్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఈరోజు నూతన సచివాలయానికి వెళ్లాలని బయలుదేరారు. అయితే రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడం. దీంతో పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీడియో కోసం ఇక్కడ చూడండి..
విజిటర్స్ గెట్‌ని పూర్తిగా మూసేవేశారు సెక్యూరిటీ సిబ్బంది. ఎమ్మెల్యేలు, విజిటర్స్‌ను మరో గేట్ నుంచి పంపుతున్నారు సెక్యూరిటీ సిబ్బంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం