మూడో అడుగు ఆయన నెత్తిన పెట్టడం ఖాయం, అందుకే అక్కడ దళిత, గిరిజన దీక్ష: రేవంత్ రెడ్డి

|

Aug 22, 2021 | 7:10 PM

సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాల్లో సైతం అభివృద్ధి శూన్యమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. మూడుచింతలపల్లి

మూడో అడుగు ఆయన నెత్తిన పెట్టడం ఖాయం, అందుకే అక్కడ దళిత, గిరిజన దీక్ష: రేవంత్ రెడ్డి
Revanth Reddy
Follow us on

Revanth Reddy: సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాల్లో సైతం అభివృద్ధి శూన్యమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. మూడుచింతలపల్లి గ్రామాన్ని కూడా కేసీఆర్ దత్తత తీసుకున్నారని చెప్పిన రేవంత్.. అందుకే అక్కడ 24, 25 తేదీలలో దళిత, గిరిజన దీక్ష చేపడుతున్నామని వెల్లడించారు. కేసీఆర్ దత్తత తీసుకున్న మూడుచింతల పల్లి ఊరు ఎంత అభివృద్ధి జరిగిందో మీడియాకు కూడా చూపిస్తానని రేవంత్ చెప్పుకొచ్చారు.

హుజురాబాద్ ఎన్నికలకు సంబంధించిన అన్ని అంశాలు దామోదర రాజనర్సింహ.. ఆయన కమిటీనే చూస్తారని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. “అభ్యర్థి ఎంపిక.. ఎన్నికల ప్రచారం తోపాటు అన్ని అంశాలు దామోదర రాజనర్సింహ కమిటీ చూస్తుంది. ఈటెల రాజేందర్ బీజేపీ అభ్యర్థి కావడానికి కారణం కేసీఆర్. ఈటెల రాజేందర్‌తో చర్చలకు వచ్చినప్పుడు కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన ప్రవేట్ విమానం ఎవరిది.? ఆ ప్రవేట్ విమానం ఏర్పాటు చేసిందే కేసీఆర్ . కాంగ్రెస్ ఎవరినో గెలిపించేందుకు ఎందుకు పనిచేస్తుంది.? మా పార్టీ సన్యాసుల మఠం కాదు కదా.? జ్ఞానం లేని వారు మాట్లాడే మాటలు అవి.. ఈటెల అవినీతి గురించి హడావిడి చేసిన కేసీఆర్ .. ఆయన బీజేపీలో చేరాక ఎందుకు దాని గురించి మాట్లాడటం లేదు. విచారణ నివేదికలు ఎటుబోయాయి.. రాజేందర్ పై కేసీఆర్ చర్యలపై కేసీఆర్ చిత్తశుద్ధి ఎంతో తెలుస్తుంది.” అంటూ రేవంత్ ప్రశ్నలు సంధించారు.

టీఆర్ఎస్, బీజేపీ పార్టీలది కొనుగోలు రాజకీయాలన్న రేవంత్ రెడ్డి.. “నేను పీసీసీ చీఫ్ అయ్యాక ఈటెల రాజేందర్ కాంగ్రెస్ లోకి వస్తానని అడగలేదు.. అంతకు ముందు జరిగిన విషయాలు నాకు తెలియదు.. మూడో అడుగు కేసీఆర్ నెత్తిన పెట్టడం ఖాయం.. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే.. నేను గజ్వెల్‌కు వెళ్ళడం ఖాయం. గజ్వేల్‌లో ఉపఎన్నిక రావాలంటే కేసీఆర్ రాజీనామా చేయాలి కదా. అక్కడ నేను పోటీ చేయాలా వద్దా అనేది పార్టీ నిర్ణయిస్తుంది. కేసీఆర్ దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. కేసీఆర్ దళితులకు పది లక్షలు ఇవ్వడం కాదు.. ఎంత చేసినా తక్కువే.” అని రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ గాంధీ భవన్లో జరిపిన మీడియా చిట్ చాట్‌లో చెప్పుకొచ్చారు.

Read also: Shamirpet: చిన్న నిర్లక్ష్యం.. ఎంత పెద్ద ప్రమాదానికి దారి తీసింది.. శామీర్‌పేట్‌ దగ్గర జరిగిన యాక్సిడెంట్‌ చూస్తే షాకవుతారు.!