Telangana Congress: ఎంపీ కోమటిరెడ్డికి రేవంత్ క్షమాపణలు..అద్దంకి పై చర్యలు తప్పవన్న పీసీసీ చీఫ్

కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమపణాలు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర

Telangana Congress: ఎంపీ కోమటిరెడ్డికి రేవంత్ క్షమాపణలు..అద్దంకి పై చర్యలు తప్పవన్న పీసీసీ చీఫ్

Updated on: Aug 13, 2022 | 10:20 AM

Telangana Congress:కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమపణాలు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర ఎంతో కీలకమైనదని.. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అవసరమన్నారు. తనను పార్టీ నుంచి దూరం పెట్టిందంటూ.. ఎటువంటి సమాచారం ఇవ్వడంలేదంటూ.. కొద్దిరోజులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. చుండూరులో జరిగిన సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడటంపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఆవ్యాఖ్యలపై తాను వెంకటరెడ్డికి కమాపణలు చెప్తునని అన్నారు. అద్దంకి దయాకర్ పై నిబంధనల ప్రకారం చర్యలు తప్పవన్నారు. రాజకీయాల్లో ఇలాంటి భాష ఎవరికి మంచిది కాదని.. పరిమితులకు లోబడే మాట్లాడాల్సి ఉంటుందన్నారు. దీనికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కమాపణలు తెలియజేస్తూ ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. తెలంగాణ సాధనలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక భూమిక పోషించాడన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..