Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాలు, ఉపరితల ద్రోణి ఏర్పడిన కారణంగా రాష్ట్రంలో గత 2 రోజులుగా వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు వాగులు, వంకలు పొంగి పోర్లుతుండడంతో జలాశయాలలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
ఇదిలా ఉంటే ఈరోజు, రేపు కూడా రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటతోపాటు… వరంగల్ అర్బన్, గ్రామీణం, మహబూబాబాద్, కరీంనగర్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డీఆర్ఎఫ్ బృందాలు, ఇతర అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక గ్రేటర్‌లో వర్షం, సంబంధిత సమస్యలు తలెత్తితే అత్యవసర సహాయం కోసం 100 నంబరు కు కానీ, 040-29555500 నంబరుకు కానీ ఫిర్యాదు చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రజలకు సూచించారు. ఇక వర్షం నీటిని తొలగించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణా బృందాలు, మాన్ సూన్ బృందాలు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నాయి. పలు చోట్ల వాన నీటిని మోటార్ల ద్వారా పంపింగ్ చేసి క్లియర్ చేస్తున్నారు.
Also Read: Gold and Silver Price: స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి..
Viral News: శునకాల డీఎన్‌ఏతో యజమానులకు జరిమానాలు.. ఎందుకో తెలుసా?