AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : సరదా తీర్చిన ఉయ్యాల.. పట్టు తప్పి 6300 అడుగుల లోయలోకి పడిపోయారు.. అయినా బ్రతికి బయటపడ్డారు..

Shocking Video: సాదారణంగానే ఉయ్యాల అంటే చాలా మంది ఇష్టపడుతారు. ఉయ్యాలలో ఊగుతుంటే ఆ సరదానే వేరు. పల్లెటూర్లలో అయితే..

Viral Video : సరదా తీర్చిన ఉయ్యాల.. పట్టు తప్పి 6300 అడుగుల లోయలోకి పడిపోయారు.. అయినా బ్రతికి బయటపడ్డారు..
Viral Video
Shiva Prajapati
| Edited By: Rajeev Rayala|

Updated on: Jul 15, 2021 | 10:12 PM

Share

Viral Video : సాదారణంగానే ఉయ్యాల అంటే చాలా మంది ఇష్టపడుతారు. ఉయ్యాలలో ఊగుతుంటే ఆ సరదానే వేరు. పల్లెటూర్లలో అయితే.. మర్రిచెట్లు ఊడలను ఉయ్యాలుగా మార్చుకుని చిన్నపిల్లలు ఊగడం మనం చూస్తుంటాం. మరికొందరు చెరువు గట్టున చెట్టుపై తాడుతో ఉయ్యాల కట్టి ఊగుతారు. ఇక పట్టణాల్లో అయితే, ఇళ్లలోనే గార్డెన్‌లలో సేద తీరేందుకు అనుగుణంగా ఉయ్యాలలను ఏర్పాటు చేసుకుంటారు. అయితే, తాజాగా ఈ ఉయ్యాల సరదా ఇద్దరు యువతుల ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. జాలీ ట్రిప్‌కు వెళ్లిన ఈ యువతులు ఊహించనీ రీతిలో ప్రమాదం బారిన పడ్డారు. యమధర్మ రాజుకు హాయ్ చెప్పి వచ్చినంత పని అయ్యింది. సాధారణంగా 6,300 లోతులో పడిన వారు ఎవరైనా బతుకుతారా? కానీ అదృష్టం అంటే వీరిదే.. వీరు బ్రతికి వచ్చారు. అందుకే యమధర్మ రాజుకు హాయ్ చెప్పి వచ్చారని వ్యాఖ్యానించాల్సి వచ్చింది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. రష్యాలోని డగేస్టన్‌లో ఓ టూరిస్ట్‌స్పాట్ ఉంది. టూరిస్టులకు సరికొత్త అనుభూతి కోసం కొండ అంచున ఉయ్యాల ఏర్పాటు చేశారు. ఆ టూరిస్ట్ స్పాట్‌కు వచ్చిన కొందరిలో ఇద్దరు యువతులు ఉయ్యాల ఊగేందుకు ఆసక్తి చూపారు. కొండ అంచున ఏర్పాటు చేసిన ఉయ్యాలలో ఊగితే చాలా థ్రిల్‌గా ఉంటుందని భావించి.. అదే ప్రయత్నం చేశారు. కానీ వారికి ఊహించని షాక్ ఎదురైంది. ఇద్దరు యువతులు ఉయ్యాల ఎక్కగా.. మరో వ్యక్తి ఆ ఉయ్యాలను బలంగా ఊపాడు. మూడు సార్లు అంతే బలంగా ఊపాడు. నాలుగోసారి కూడా ఊపాడు. అయితే, అదే సమయంలో ఆ యువతులు.. కిందకు దిగేందుకు ప్రయత్నించారు. ఇంకేముందు.. వారి ప్రయత్నం విఫలమై.. ఆ ఉయ్యాల అదుపు తప్పడంతో వారు అమాంతం 6,300 అడుగుల లోయలోకి పడిపోయారు. అయితే, వారు కొండ అంచున ఏర్పాటు చేసిన డెక్కింగ్ ప్లాట్‌ఫాం మీద పడటంతో ప్రాణాలు దక్కాయి. ప్రమాదంలో వారికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ షాకింగ్ వీడియోను మీరూ చేసేయండి.

Viral Video:

Also read:

Viral Video: బాప్ రే.. ఇంత పెద్ద లాలీపాప్‌ని ఎప్పుడైనా చూశారా?.. అసలెలా తయారు చేశారంటే..!

Viral Video: అగ్నిప్రమాదంలో చిక్కుకున్న తల్లి.. తన రెండేళ్ల చిన్నారిని కిటికీలోంచి విసిరేసింది.. షాకింగ్ వీడియో..

Viral Video: పెళ్లి వేదికపై వధువును చూసి ఫిదా అయిపోయిన వరుడు.. గుండెపై చేయి వేసి అలా పడిపోయాడు.. ఫన్నీ వీడియో..