AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెళ్లి వేదికపై వధువును చూసి ఫిదా అయిపోయిన వరుడు.. గుండెపై చేయి వేసి అలా పడిపోయాడు.. ఫన్నీ వీడియో..

Viral Video: వివాహం ప్రతీ ఒక్కరి జీవితంలో ఎంతో మధురమైన క్షణం. ప్రతీ ఒక్కరూ తమ వివాహాన్ని ఒక అద్భుతమైన జ్ఞాపకంగా నిలిచేలా..

Viral Video: పెళ్లి వేదికపై వధువును చూసి ఫిదా అయిపోయిన వరుడు.. గుండెపై చేయి వేసి అలా పడిపోయాడు.. ఫన్నీ వీడియో..
Groom
Shiva Prajapati
|

Updated on: Jul 15, 2021 | 10:02 PM

Share

Viral Video: వివాహం ప్రతీ ఒక్కరి జీవితంలో ఎంతో మధురమైన క్షణం. ప్రతీ ఒక్కరూ తమ వివాహాన్ని ఒక అద్భుతమైన జ్ఞాపకంగా నిలిచేలా.. విభిన్నంగా జరుపుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగా తమ తమ స్థాయిలను బట్టి వివాహాన్ని ఘనంగా జరుపుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఈ వివాహ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది. సాధారణంగా పెళ్లంటే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఓ రేంజ్‌లో ముస్తాబై వస్తారు. కళ్లు చెదిరే దుస్తులుతో.. మహారాణిలా వధువు పెళ్లి పీఠటలపైకి అడుగు పెడితే.. మహారాజులగా వరుడు అడుగు పెడతాడు. తాజా వీడియోలోనూ వధు, వరులు అంతే రేంజ్‌లో ముస్తాబయ్యారు. వధు,వరులు ఇద్దరూ పెళ్లి వేదికపైకి వస్తారు.

వధువు అలా వేదికపైకి రాగానే.. వరుడు ఆమెను అలా చూస్తుండిపోయాడు. ఆమె అందానికి ఫిదా అయిపోయాడు. వధువును చూసి మైమరిచిపోయిన వరుడు.. అలా గుండెలపై చేయి వేసుకుని నేలకు వాలిపోతాడు. అయితే, పక్కనే ఉన్న మరో వ్యక్తి.. ఆ వరుడిని పట్టుకుంటాడు. వరుడు ఎక్స్‌ప్రెషన్స్‌ను చూసి వధువు ముసిముసి నవ్వులు నవ్వుతోంది. అతని చర్యతో మురిసిపోయిన వధువు.. సిగ్గుతో తలను పక్కకు తిప్పుకుంటుంది. చిరునవ్వులు చిందిస్తుంటుంది. కాగా, వధువును చూసి వరుదు అలా పడిపోతున్న సమయంలో బాలీవుడ్ బాద్‌షా నటించిన ‘మెయిన్ హూ నా’ సినిమాలోని ‘తుమ్‌సే మిల్‌కె దిల్ హ హాల్’ పాట ప్లే సెట్ చేశారు. ఈ పాట ఈవీడియోనె నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లిందనే చెప్పాలి.

ఈ అందమైన జంటకు సంబంధించిన అద్భుతమైన సీన్‌ అంతా వీడియోలో రికార్డ్ అవ్వగా.. ఆ వీడియోను ‘దుల్హానియా’ అనే ఇన్‌స్టాగ్రమ్ పేజీలో షేర్ చేశారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు సైతం ఫిదా అయిపోతున్నారు. చూడ ముచ్చటా ఈ జంటకు ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా వరుడు ఫిదా అవడం.. వధువు సిగ్గుపడుతూ ముసిముసి నవ్వులు నవ్వడం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. రెండు రోజుల క్రితమే ఈ వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఇప్పటి వరకు దీనిని 15 వేల మందికిపైగా చూశారు. మరి ఈ బ్యూటీఫుల్ కపుల్‌కి సంబంధించిన ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Viral Video: బాప్ రే.. ఇంత పెద్ద లాలీపాప్‌ని ఎప్పుడైనా చూశారా?.. అసలెలా తయారు చేశారంటే..!

Viral Video: అగ్నిప్రమాదంలో చిక్కుకున్న తల్లి.. తన రెండేళ్ల చిన్నారిని కిటికీలోంచి విసిరేసింది.. షాకింగ్ వీడియో..

AP-TS Water Disputes: ఆంధ్రా-తెలంగాణ జలవివాదం.. ఏపీ సీఎం జగన్‌పై సంచలన కామెంట్స్ చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి..

Follow Us
IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరవచ్చు
IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరవచ్చు
భారత్‌లో పెట్రోల్‌పైనే ఎక్కువ ఖర్చు.. ఖంగుతినే లెక్కలివే..
భారత్‌లో పెట్రోల్‌పైనే ఎక్కువ ఖర్చు.. ఖంగుతినే లెక్కలివే..
దేశంలో ఇప్పటికీ రైల్వే సర్వీస్‌లు లేని రాష్ట్రం ఏదో మీకు తెలసా?
దేశంలో ఇప్పటికీ రైల్వే సర్వీస్‌లు లేని రాష్ట్రం ఏదో మీకు తెలసా?
పండ్లలో రాజు మామిడి.. మరి రాణి ఎవరో తెలుసా..?
పండ్లలో రాజు మామిడి.. మరి రాణి ఎవరో తెలుసా..?
హెచ్-1బీ ఫీజు పెంపు రద్దు..! కోర్టు సంచలన తీర్పు!
హెచ్-1బీ ఫీజు పెంపు రద్దు..! కోర్టు సంచలన తీర్పు!
రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? మీ హాల్‌టికెట్ వచ్చిందా?
రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? మీ హాల్‌టికెట్ వచ్చిందా?
కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
అదృష్టం వరించింది.. జూన్ 17 నుంచి వీరి ఇంట ధన వర్షం..డబ్బే డబ్బు
అదృష్టం వరించింది.. జూన్ 17 నుంచి వీరి ఇంట ధన వర్షం..డబ్బే డబ్బు
eRZL హైడ్రేషన్ డ్రైవ్: గుడివాడలో ఎలక్ట్రోలైట్ అవగాహన
eRZL హైడ్రేషన్ డ్రైవ్: గుడివాడలో ఎలక్ట్రోలైట్ అవగాహన
UGC NET 2026 రాసేవారికి అలర్ట్.. ఈ స్లిప్ తప్పనిసరిగా చెక్ చేయండి
UGC NET 2026 రాసేవారికి అలర్ట్.. ఈ స్లిప్ తప్పనిసరిగా చెక్ చేయండి