Telangana: ‘టిఫిన్‌ బాక్స్‌ బైఠక్‌’ పేరుతో నయా వ్యూహాం.. అధికారమే లక్ష్యంగా కమలం నేతల అడుగులు

బీజేపీ టిఫిన్‌ బాక్స్‌ బైఠక్‌.. పేరు కాస్త కొత్తగా ఉన్నా.. కమల దళాన్ని కలిపేందుకు బీజేపీ ఎత్తుకున్న సరికొత్త మీటింగ్ ఇదే.. వన భోజనాల మాదిరిగా..ఎవరింటి నుంచి వాళ్లు క్యారియర్లు కట్టుకుని పార్కులు, పబ్లిక్‌ ప్లేసులు, ఫంక్షన్‌ హాళ్లకు వచ్చారు. పరిచయ కార్యక్రమాలు చేసుకున్నారు. ఆ తర్వాత టిఫిన్‌ బాక్సులు ఓపెన్‌ చేశారు. తెచ్చుకున్న రుచికరమైన వంటలను..

Telangana: టిఫిన్‌ బాక్స్‌ బైఠక్‌ పేరుతో నయా వ్యూహాం.. అధికారమే లక్ష్యంగా కమలం నేతల అడుగులు
Telangana Bjp

Updated on: Jul 16, 2023 | 6:29 PM

బీజేపీ టిఫిన్‌ బాక్స్‌ బైఠక్‌.. పేరు కాస్త కొత్తగా ఉన్నా.. కమల దళాన్ని కలిపేందుకు బీజేపీ ఎత్తుకున్న సరికొత్త మీటింగ్ ఇదే.. వన భోజనాల మాదిరిగా..ఎవరింటి నుంచి వాళ్లు క్యారియర్లు కట్టుకుని పార్కులు, పబ్లిక్‌ ప్లేసులు, ఫంక్షన్‌ హాళ్లకు వచ్చారు. పరిచయ కార్యక్రమాలు చేసుకున్నారు. ఆ తర్వాత టిఫిన్‌ బాక్సులు ఓపెన్‌ చేశారు. తెచ్చుకున్న రుచికరమైన వంటలను.. కబుర్లు చెప్పుకుంటూ..కమ్మగా తిన్నారు. ఫుడ్‌ షేర్‌ చేసుకుంటూ ఆరగించారు. పాత, కొత్త అనే తేడా లేకుండా..బైఠక్‌కు వచ్చిన వాళ్లంతా కలిసిపోయారు. ఇక దళంగా ఏర్పడ్డారు.. ఆ తర్వాత పార్టీ చెప్పిన విధి విధానాలకు అనుగుణంగా తీర్మానాలు చేశారు. ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని..అందుకు ప్రతి కార్యకర్త శ్రమటోడ్చాలని ఆయా ప్రాంతాల కమలనాథులు పిలుపునిచ్చారు.. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో టిఫిన్‌ బాక్స్‌ బైఠక్‌ను నిర్వహించారు.

కరీంనగర్‌ జిల్లాలో జరిగిన టిఫిన్‌ బాక్స్‌ బైఠక్‌కు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ హాజరు కాలేదు. దీంతో.. కార్యకర్తల్లో రకరకాల అభిప్రాయాలు వెలువడినా.. కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేతలు పార్టీ ఆదేశాన్ని వెల్లడించారు. ఇలాంటి కార్యక్రమాలతో ఐకమత్యం పెరుగుతుందని జిల్లా బీజేపీ నాయకులు అంటున్నారు. ఇక ఖమ్మంలోని వెలుగుమట్ల అర్బన్‌ పార్కులో బీజేపీ టిఫిన్‌ బాక్స్‌ బైఠక్‌ను ఘనంగా జరుపుకున్నారు. అందరూ కలిసి భోజనం చేశారు. వనభోజనాలను మరిపించారు. జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో బీజేపీని సంస్థాగతంగా.. ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై చర్చించారు. అయితే కొంతమంది బీజేపీ శ్రేణులను పార్కులోకి అనుమతించకపోవడంతో కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది.

మిగతా జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో టిఫిన్‌ బాక్స్‌ బైఠక్‌లు వినూత్నంగా జరిగాయి. కార్యకర్తల్లో జోష్‌ నింపాయి. చాలా ప్రాంతాల్లో కార్తీక మాసం వనభోజనాలను తలపించినా..వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలు ఎలా పనిచేయాలన్న అంశంపై నేతలు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..