మరో అద్భుత ఆవిష్కరణకు వేదిక కానుంది సిద్దిపేట పట్టణం..తిరుపతిలోని వేంకటేశ్వర స్వామి ఆలయ నమూనలోనే సిద్దిపేటలో వేంకటేశ్వర ఆలయాన్ని నిర్మించబోతున్నారు..దీనికి సంబంధించిన స్థలాన్ని కూడా టిటిడి,ఇంజనీరింగ్ అధికారులు వచ్చి చూసి వెళ్లారు..ఆలయ నిర్మాణం నమూనా,డిజైన్ ఇప్పటికే ఫైనల్ అయినట్లు సమాచారం.. దీని పై పలుమార్లు టీటీడీ అధికారులతో పాటు అక్కడి ఇంజనీరింగ్ విభాగం వారితో నిత్యం వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి హరీష్ రావు మాట్లాడి పలు సూచనలు చేస్తున్నారు..
సిద్దిపేట పట్టణ పరిధిలో నిర్మించ తలపెట్టిన ఈ ఆలయం సరిగ్గా తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయ వైభవం ఉట్టిపడేలా ఉండాలని,అలాగే చుట్టు ప్రాకారం,భక్తులు కలియ తిరిగేలా ఉండాలని మంత్రి హరీష్ రావు టిటిడి అధికారులతో చెప్పారు..
కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం సిద్దిపేట పట్టణంలో జరుగుబొంతుంది అని తెలియగానే స్వామి భక్తులు ఉబ్బితబ్బిపోతున్నారు..ఆలయంలోకి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో ఈ ఆలయాన్ని 30 కోట్ల రూపాయలతో నిర్మించ నున్నారు.వచ్చే శ్రావణ మాసంలో పనులు ప్రారంభం కానున్నాయి..
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..