TS School Timings: తెలంగాణ సర్కారు బడుల్లో మారనున్న పనివేళలు..! కొత్త టైమింగ్స్ ఇవే..

|

Jun 24, 2023 | 10:39 AM

తెలంగాణ పాఠశాలల సమయాల్లో కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల పనివేళలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తున్నాయి. ఉన్నత పాఠశాలలు 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో..

TS School Timings: తెలంగాణ సర్కారు బడుల్లో మారనున్న పనివేళలు..! కొత్త టైమింగ్స్ ఇవే..
TS School Timings
Follow us on

హైదరాబాద్‌: తెలంగాణ పాఠశాలల సమయాల్లో కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల పనివేళలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తున్నాయి. ఉన్నత పాఠశాలలు 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో చదివేది చిన్నారులైనందున వారు ఉదయం త్వరగా నిద్ర లేచి, పాఠశాలలకు రాలేరు. ఉన్నత పాఠశాలల్లో చదివేది కాస్త పెద్ద పిల్లలు. ఐతే పాఠశాలల వెళల్లో అందుకు విరుద్దంగా ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటలకు, ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటలకు మొదలవుతున్నాయని కొందరు విద్యాశాఖ దృష్టికి తెచ్చారు. దీంతో అన్ని పాఠశాలు ఉదయం 9.30 లేదా 9.45 గంటలకు ప్రారంభించాలనే యోచనలో ఉంది విద్యాశాఖ. ఆ ప్రకారంగా సమయాల మార్పుపై ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ఐతే పాఠశాలల సమయాలు మార్చాలంటే ముందుగా ప్రభుత్వం ఆమోదం పొందాల్సి ఉంటుంది. నిపుణులతో చర్చించి, అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ప్రభుత్వ పాఠశాలలకు మరింత నష్టం జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాలలు ఉదయం 7.30 లేదా 8 గంటలకే పిల్లల్ని వాహనాల్లో తీసుకెళ్తున్నాయి. అందుకు భిన్నంగా ప్రభుత్వ పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభిస్తే విద్యార్థుల సంఖ్య మరింత తగ్గే ప్రమాదం ఉంది. పైగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది తల్లిదండ్రులు ఉదయం 9 గంటల లోపే పొలం పనులకు వెళ్తుంటారు. ప్రాథమిక పాఠశాలలు మరింత ఆలస్యంగా తెరిస్తే వారికీ ఇబ్బంది అవుతుంది. ఉన్నత పాఠశాలలకు పక్క ఊళ్ల నుంచి విద్యార్ధులు వస్తారు. అందుకే అరగంట ఆలస్యంగా తెరుస్తారని మరికొందరు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.