AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పులి భయం..బతుకు భయం.. మాటు వేసి ఉన్న జంట పులులు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పులుల భయం పట్టిపీడిస్తోంది. వారం రోజులుగా బెల్లంపల్లి ని పెద్దపులి చిరుతపులి భయం వీడటం లేదు. బెల్లంపల్లి పట్టణానికి అతి సమీపంలోనే కన్నాల అటవీ ప్రాంతంలో పులులు మాటు వేశాయి. నాలుగు రోజుల క్రితం అడవి పందిని చంపిన పెద్దపులి బీ -2 గా అధికారులు గుర్తించారు. అదే ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తూ ఉంది. కన్నాల అటవీప్రాంతంలో పెద్దపులి సంచారిస్తూ ట్రాప్‌ కెమెరాలకు చిక్కింది. దీంతో కన్నాల-బుగ్గ రహదారిపై నిషేధాజ్ఞలు

పులి భయం..బతుకు భయం.. మాటు వేసి ఉన్న జంట పులులు
Tiger
K Sammaiah
|

Updated on: Feb 04, 2025 | 10:54 AM

Share

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పులుల భయం పట్టిపీడిస్తోంది. వారం రోజులుగా బెల్లంపల్లి ని పెద్దపులి చిరుతపులి భయం వీడటం లేదు. బెల్లంపల్లి పట్టణానికి అతి సమీపంలోనే కన్నాల అటవీ ప్రాంతంలో పులులు మాటు వేశాయి. నాలుగు రోజుల క్రితం అడవి పందిని చంపిన పెద్దపులి బీ -2 గా అధికారులు గుర్తించారు. అదే ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తూ ఉంది. కన్నాల అటవీప్రాంతంలో పెద్దపులి సంచారిస్తూ ట్రాప్‌ కెమెరాలకు చిక్కింది. దీంతో కన్నాల-బుగ్గ రహదారిపై నిషేధాజ్ఞలు విధించారు అధికారులు.

బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ శివారులో నీ అటవీ ప్రాంతం నీటి కుంటలు, పత్తి చేన్లు పెద్దపులికి ఆవాసంగా మారాయి. అటువైపుగా ప్రజలు వెళ్లకుండా ఫారెస్ట్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కన్నాల బుగ్గ అడవుల్లో జంట పులుల యథేచ్చగా తిరుగుతున్నాయి. వారం రోజులుగా పెద్దపులి కన్నాల అడవుల లోనే మకాం వేసి ఉండటంతో సమీప గ్రామాల ప్రజలు ప్రాణాల అరిచేతుల్లో పెట్టుకుని ఉండాల్సిందే. క్షణక్షణం, అనునిత్యం పెద్దపులి కదలికలు, అడుగుజాడలను తెలుసుకుంటూ ప్రజలు ఊపిరి పీల్చు కుంటున్నారు.

బెల్లంపల్లిలోని కెమికల్ ఏరియా, కాల్‌టెక్స్ ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు పెద్దపులి పాదముద్రలు గుర్తించారు. దాంతో.. సమీప ప్రాంతాల్లోని ప్రైవేటు పాఠశాలలకు యాజమాన్యాలు సెలవులు ప్రకటించారు. విద్యార్థులను‌ బయటకు పంపవద్దని హెచ్చరించారు. మరోవైపు.. బెల్లంపల్లి పట్టణ ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే.. కన్నాలలోని బుగ్గ రాజరాజేశ్వర ఆలయం సమీపంలో పెద్దపులి సంచరించినట్లు స్థానికులు తెలిపారు. గత మూడు నెలలుగా కొమురం భీం, మంచిర్యాల జిల్లాల్లో పెద్దపులి సంచారం ప్రజలను భయపెడుతోంది.

పెద్దపులి కన్నాల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మకాం వేసి సంచరిస్తుండడంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.కన్నాల అటవీ ప్రాంతానికి సమీప గ్రామాలైన కన్నాల, లక్ష్మీపూర్, ఎస్సీ కాలనీ, బుగ్గ గూడెం,వరి పేట, అంకుశం, గోండుగూడెం, గాంధీనగర్, కుంట రాములు బస్తి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పత్తి చేనులోకి వెళ్లే రైతులు అటవీ ప్రాంతం వైపు వెళ్ళవద్దని అటవీ అధికారులు హెచ్చరిస్తూ కన్నాల-బుగ్గ రహదారిపై నిషేధాజ్ఞలు విధించారు. అయితే వేటగాళ్ల నుంచి పెద్దపులిని రక్షించేందుకు 15 మందితో కూడిన ఎనిమల్ ట్రాకింగ్ టీంతో నిరంతరం అటవీ ప్రాంతంలో పులిని పర్యవేక్షిస్తున్నారు.

కొత్త జీతం ఎలా నిర్ణయిస్తారు..? 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం..
కొత్త జీతం ఎలా నిర్ణయిస్తారు..? 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం..
మరోవారంలో MAT 2025 రాత పరీక్ష.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్
మరోవారంలో MAT 2025 రాత పరీక్ష.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్
SBIలో తక్కువ వడ్డీకే లోన్లు.. నేటి నుంచే ప్రారంభం!
SBIలో తక్కువ వడ్డీకే లోన్లు.. నేటి నుంచే ప్రారంభం!
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం ధరలు.. వెండి రికార్డ్
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం ధరలు.. వెండి రికార్డ్
RBI సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కు 2026 దరఖాస్తు చేశారా? చివరి ఛాన్స్ ఇదే
RBI సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కు 2026 దరఖాస్తు చేశారా? చివరి ఛాన్స్ ఇదే
గూగుల్‌ సరికొత్త ఫీచర్‌ తీసుకొచ్చిన! 70 భాషలు మీకు వచ్చేసినట్టే..
గూగుల్‌ సరికొత్త ఫీచర్‌ తీసుకొచ్చిన! 70 భాషలు మీకు వచ్చేసినట్టే..
JEE Advanced 2026 పరీక్ష సిలబస్‌ విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదిగో
JEE Advanced 2026 పరీక్ష సిలబస్‌ విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదిగో
టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే కొనేయండి.. లేదంటే..
టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే కొనేయండి.. లేదంటే..
12 రాశులవారికి సోమవారం నాటి రాశిఫలాలు
12 రాశులవారికి సోమవారం నాటి రాశిఫలాలు
ఆపరేషన్‌ కగార్‌లో జప్తు చేసిన నక్సల్ ఆస్తులు ఎంతంటే?
ఆపరేషన్‌ కగార్‌లో జప్తు చేసిన నక్సల్ ఆస్తులు ఎంతంటే?