Telangana-Tiger Fear: తెలంగాణలో పులుల సంచారం నానాటికి పెరుగుతున్నాయి. జనావాసాల్లో సంచరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ప్రతి రోజూ ఎక్కడో చోట పశువుల మందపై, పశువుల కాపరులపై దాడి చేస్తూ జనాలకు, అటవీశాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పులుల సంచారం కారణంగా పలు జిల్లాల్లో ప్రజలు ఒంటరిగా ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జడుసుకుంటున్నారు. తాజాగా ములుగు జిల్లాను బెబ్బులి వణికించింది. తాడ్వాయి మండలంలోని కామారం అడవుల్లో పెద్దపులి సంచరించింది. అడవిలో మేతకు వెళ్లిన పశువుల మందపై పెద్ద పులి ఒక్కసారిగా దాడి చేసింది. పులి దాడిలో పశువులు చెల్లాచెదురు అయ్యాయి.
పులి దాడిని గమనించిన పశువుల కాపర్లు హనుమంతు, రమేష్.. ప్రాణభయంతో పరుగులు పెడుతూ గ్రామానికి వెళ్లారు. విషయాన్ని అటవీశాఖ అధికారులకు చేరవేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు.. పాదముద్రల ఆధారంగా పులి సంచరిస్తుందని నిర్ధారించారు. పశువులను మేపేందుకు అడవిలోకి తీసుకువెళ్లవద్దని, ఒంటరిగా ఎవరూ అడవిలోకి వెళ్లవద్దని సూచించారు. కాగా, పులి దాడితో గల్లంతైన పశువుల కోసం గ్రామస్తులు గాలిస్తున్నారు.
Also read:
Health Tips: తిమ్మిర్లు వస్తున్నాయా..? అయితే ఆ సమస్యలున్నట్లే.. వెంటనే వైద్యుడిని కలవండి.. లేకుంటే..