Telangana: దామోదర వర్సెస్ జగ్గారెడ్డి .. ఇద్దరు నేతల మధ్య చిచ్చు పెట్టిన టికెట్ పంచాయితీ..

ఈ క్రమంలోనే మూడో జాబితా వచ్చిన వెంటనే పటాన్‌చెరు‌కు చెందిన కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ అనుచరులు పెద్ద ఎత్తున పటాన్‌చెరులో ఆందోళన కార్యక్రమాలు చేశారు. మంగళవారం శ్రీనివాస్‌ గౌడ్‌ సతీమణి మాట్లాడుతూ.. జగ్గారెడ్డి డబ్బులకు అమ్ముడు పోయారంటూ ఆరోపించారు. ఈ ఆరోపణలపై జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. పఠాన్‌ చెరువు టికెట్ నీలం మధుకు ఇవ్వడం పట్ల దామోదర్‌ రాజా నర్సింహా తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు...

Telangana: దామోదర వర్సెస్ జగ్గారెడ్డి .. ఇద్దరు నేతల మధ్య చిచ్చు పెట్టిన టికెట్ పంచాయితీ..
Jagga Reddy,Damodar Raja Narasimha

Edited By:

Updated on: Nov 07, 2023 | 9:34 PM

కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయతీ మెదక్ జిల్లాలో ఇదరి నేతల మధ్య చిచ్చు పెట్టింది. పటాన్‌చెరువు టికెట్‌ను కాటా శ్రీనివాస్‌కు, అలాగే నర్సాపూర్‌ టికెట్‌కు గాలి అనిల్‌కు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దామోదర రాజనర్సింహ సూచించారు. అయితే ఆయన సూచనలకు విరుద్ధంగా నర్సాపూర్‌ టికెట్‌ను ఆవుల రాజిరెడ్డికి, పటాన్‌చెరు టికెట్‌ను చివరి నిమిషంలో కాంగ్రెస్‌లో చేరిన నీలం మధు ముదిరాజ్‌కు కేటాయించారు.

ఈ క్రమంలోనే మూడో జాబితా వచ్చిన వెంటనే పటాన్‌చెరు‌కు చెందిన కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ అనుచరులు పెద్ద ఎత్తున పటాన్‌చెరులో ఆందోళన కార్యక్రమాలు చేశారు. మంగళవారం శ్రీనివాస్‌ గౌడ్‌ సతీమణి మాట్లాడుతూ.. జగ్గారెడ్డి డబ్బులకు అమ్ముడు పోయారంటూ ఆరోపించారు. ఈ ఆరోపణలపై జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. పఠాన్‌ చెరువు టికెట్ నీలం మధుకు ఇవ్వడం పట్ల దామోదర్‌ రాజా నర్సింహా తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.

శ్రీనివాస్‌ గౌడ్‌ అతని భార్యతో తనను బద్నామ్‌ చేపిస్తున్నాడని, ఇది మంచి పద్దతి కాదని, దమ్ముంటే రాజకీయంగా తేల్చుకోవాలని, వ్యక్తిగతంగా తన ఇమేజ్‌ను దామోదర్ రాజానర్సింహా డ్యామేజ్‌ చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ఈ విషయం ఇక్కడితో సమసిపోతుందా.. లేక చినికి చినికి గాని వానగా మారి జిల్లాలో ఉన్న ఇద్దరు నాయకులు ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ రాజకీయ ముఖచిత్రం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..