PM Modi: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటనకు కౌంట్‌ డౌన్‌.. భద్రతపై పోలీసుల స్పెషల్ ఫోకస్..

|

Jun 28, 2022 | 9:50 PM

PM Modi Security: ట్రాఫిక్‌ అలెర్ట్‌!...జులై 2,3న హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ డైవర్షన్‌ ఏ రూట్‌లో. ఈ పాయింట్‌పైనే ఫోకస్‌ పెట్టారు పోలీసులు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడి హాజరు కాబోతున్నారు.ఆ నేపథ్యంలో రూట్‌మ్యాప్‌ సహా భద్రతపరంగా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.

PM Modi: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటనకు కౌంట్‌ డౌన్‌.. భద్రతపై పోలీసుల స్పెషల్ ఫోకస్..
Security For Pm Modi
Follow us on

జులై 2,3 తేదిల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో కార్యవర్గ సమావేశం.. 3న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ..ఈ రెండు కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 5వేల మంది పోలీసు బలగాలతో మూడెంచల ప్రత్యేక భద్రత కల్పిస్తారు.బహిరంగ సభ జరిగే పరేడ్ గ్రౌండ్, జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే హెచ్ఐసీసీ, నోవోటెల్ మైదానాల చుట్టుపక్కల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. ఇక స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG), ఇతర కేంద్ర భద్రతా బలగాల పహారా ఎలాగూ ఉంటుంది. వీరితో సమన్వయం చేసుకుంటూ హైదరాబాద్ పోలీసులు మోడీ భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నారు.

జులై 2న ప్రధాని మోడీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు. 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా హైదరాబాద్ కు రానున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి సరాసరి మాదాపూర్ హెచ్ఐసీసీకి వెళ్తారు. ప్రధాని ,కేంద్ర మంత్రులు, పలు రాష్ర్టాల సీఎంల పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు అదనపు బలగాలను సిద్దం చేసుకోవాలని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనర్లేటకు ఆదేశాలు జారీ అయ్యాయి. హైదరాబాద్‌లో వర్షప్రభావం మొదలైన నేపథ్యంలో జులై2న వాతావరణ పరిస్థితులు ఎలా వుంటాయన్న అంశంపై కూడా పోలీసులు నివేదికలు తీసుకుంటున్నారు.

ఇటీవల పంజాబ్‌లో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకొని ప్రధాని పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చర్యలు చేపడుతున్నారు పోలీసులు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యే నేతలకు వివిధ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. రాజ్ భవన్ లో బస చేయాల్సిందిగా ప్రధానికి కోరారు గవర్నర్ తమిళ సై. కానీ ప్రధాని బస ఎక్కడ? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్-ఎస్పీజీ క్లియరెన్స్ ఇచ్చాకే ఓ క్లారిటీ రానుంది.

ప్రధాని మోదీ ఢిల్లీలో తన నివాసం నుంచి బయలుదేరింది మొదలు.. మళ్లీ ఢిల్లీ వెళ్లేవరకు.. సమావేశాలు జరిగే ప్రదేశంతోపాటు ఆ మీటింగ్స్ కోసం వచ్చినవారంతా రాకపోకలు సాగించే మార్గాలు, వారు బస చేసే ప్రాంతాలు.. ఇలా అన్నింటీకీ, అందరికీ సెక్యూరిటీని ఇవ్వడానికి దాదాపు 25 వేల మంది పోలీసు సిబ్బందిని రంగంలోకి దించబోతున్నారు. రోజూ మూడు షిఫ్టుల్లో వీళ్లు భద్రతను కల్పించాల్సి ఉంటుంది.

ప్రధాని రాజ్ భవన్ లోనే బస చేస్తే.. అక్కడి నుంచి హెచ్ఐసీసీకి, పరేడ్ గ్రౌండ్స్ కి వెళ్లి రావాల్సి ఉంటుంది. కానీ అలా ఆయన వెళ్లి వచ్చే మార్గం అంతా ఆ సమయంలో ఫుల్ ట్రాఫిక్ తో ఉంటుంది. కానీ ప్రధాని ఆ మార్గంలో ప్రయాణించాలంటే.. కచ్చితంగా ఆ ట్రాఫిక్ ని ఆపి.. గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేయాల్సిందే. ప్రధాని వెళ్లే మార్గంలో రెండువైపుల రూట్లలోనూ ట్రాఫిక్ ను ఆపాల్సి ఉంటుంది.

అలా అయితేనే ఎస్పీజీ రూట్ క్లియరెన్స్ ఇస్తుంది. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా..ప్రత్యమ్నాయాలున్నాయా? అనే అంశంపై పోలీసులు ఫోకస్‌ పెట్టారు. పంజాబ్‌ ఘటన దృష్ట్యా ప్రధాని హైదరాబాద్‌ పర్యటనపై అటు ఎస్‌పీజీ ఇటు తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారు.

తెలంగాణ వార్తల కోసం