Telangana: చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో-ప్రైవేటు బస్సు ఢీ.. ముగ్గురు స్పాట్ డెడ్..

నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి 65.. ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. తాజాగా.. యాదాద్రి భువనగిరి జిల్లా..

Telangana: చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో-ప్రైవేటు బస్సు ఢీ.. ముగ్గురు స్పాట్ డెడ్..
Bus Accident

Updated on: Feb 16, 2023 | 12:04 PM

నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి 65.. ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. తాజాగా.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, ప్రైవేటు బస్సు ఢీ కొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చే వరకు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు స్పాట్ కు చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు హైదరాబాద్ కు తరలించారు. ఈ ప్రమాదంతో హైవే పై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

కాగా.. 65వ నెంబరు జాతీయ రహదారిపై కొర్లపహాడ్ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికి అక్కడే మృతిచెందారు. గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్‌ కుటుంబంతో నకిరేకల్‌లో నివాసముంటున్నాడు. కొర్లపహాడ్‌కు వచ్చి బైక్ పై తిరుగి వెళ్తుండగా టోల్‌ప్లాజా దాటిన తర్వాత ఓ హోటల్‌ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి