Railway Job Fraud: హైదరాబాద్‌లో మరో ఘరానా మోసం బయటపడింది. రైల్వేలో ఉద్యోగాల పేరుతో కోటిన్నర కొట్టేసింది ఓ ముఠా. రైల్వే అండ్ మెట్రోరైల్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన ముగ్గురిని అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. నిందితుల నుంచి నకిలీ ఐడీ కార్డ్స్, మూడు కార్లు, ఫేక్ ఆఫర్ లెటర్స్, మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఖమ్మం జిల్లా మధిర గ్రామానికి చెందిన కాకరపర్తి సురేంద్ర ఈ కేసులో ప్రధాన నిందితుడిగా తేల్చారు హైదరాబాద్ పోలీసులు. సురేంద్ర భార్య నాగలక్ష్మి, మరో వ్యక్తి దాచేపల్లి సురేష్ లతో కలిసి పలు మోసాలకు పాల్పడినట్టు హైదరాబాద్ సీపీ మహేష్ భగవత్ వివరించారు. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసినట్టుగా సీపీ వివరించారు. ఒక్కో నిరుద్యోగి నుండి 5లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. కొందరికి నకిలీ అపాయింట్ మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. ఈ అపాయింట్ మెంట్ ఆర్డర్స్ తీసుకొని ఉద్యోగంలో చేరేందుకు వెళ్లిన బాధితులకు తాము మోసపోయామని గ్రహించి..పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా మల్కాజిగిరి పోలీసులు సురేంద్ర అలియాస్ పుట్టా సురేష్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు చెప్పారు.
Also read:
Textile: చీరలపై ఐ లవ్ యూ అని ముద్రణ.. వస్త్ర వ్యాపారులపై ప్రజల ఆగ్రహం! చివరికి ఏమైందంటే..
Hyderabad:హైదరాబాద్ పోలీసుల గొప్ప మనసు.. గ్రీన్ ఛానెల్ ద్వారా గుండె, ఊపిరితిత్తుల తరలింపు
Keerthy Suresh: జోరుమీదున్న కీర్తిసురేష్.. యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసిన ముద్దుగుమ్మ..