Telangana: పొలం పనులకు వెళ్లిన రైతులు తవ్వకాలు జరపగా.. కనిపించినవి చూడగా..

| Edited By: Ravi Kiran

Feb 28, 2025 | 1:15 PM

ఈ గ్రామం పురాతనమైనది. కొండల మధ్య ఈ గ్రామం ఉంటుంది. అంతేకాకుండా మానేరు వాగు సమీపంలో ఉంటుంది. అయితే ఇలాంటి ప్రాంతాలే.. ఆది మానవులకు అనువైన ప్రాంతాలు. దీంతో ఈ గ్రామ సమీపంలో ఆది మానవులు జీవించారు. దాదాపు వీరి జనాభా 500పైగా ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు.

Telangana: పొలం పనులకు వెళ్లిన రైతులు తవ్వకాలు జరపగా.. కనిపించినవి చూడగా..
Telugu News
Follow us on

ఈ గ్రామం పురాతనమైనది. కొండల మధ్య ఈ గ్రామం ఉంటుంది. అంతేకాకుండా మానేరు వాగు సమీపంలో ఉంటుంది. అయితే ఇలాంటి ప్రాంతాలే.. ఆది మానవులకు అనువైన ప్రాంతాలు. దీంతో ఈ గ్రామ సమీపంలో ఆది మానవులు జీవించారు. దాదాపు వీరి జనాభా 500పైగా ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు. గతంలో ఆది మానవులకు సంబంధించి సమాధులు తవ్వారు. వాటి నుంచి అస్తి పంజరాలు, మట్టి పాత్రలు, ఇతర పనిముట్లు లభ్యమయ్యాయి. ఆది మానవులు నివసించిన గ్రామం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్‌కు ప్రత్యేకత ఉంది. ఇదొక్క పర్యటక ప్రాంతం ఈ గ్రామం చుట్టూ ఎత్తైన కొండలు, పక్కన మానేరు వాగు. అయితే ఈ గ్రామానికి మరో ప్రత్యేక ఉంది. ఈ గ్రామ సమీపంలో 3 వేలకు పూర్వం ఆదిమానవులు సంచరించారు. ఈ ప్రాంతంలోనే నివాసం ఉన్నారు. దాదాపునా 500 మంది వరకు ఉన్నట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. ఇప్పటికీ ఆదిమానవుల సమాధులు చెక్కు చెదురలేదు. కొన్ని సమాధులు వ్యవసాయం చేయడంతో ఆనవాళ్లు లేకుండా పోయాయి. కానీ కొండ సమీపంలో కొన్ని సమాధులు ఉన్నాయి. 1974 సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఐదు సమాధులు తవ్వారు. ఈ రాళ్ల కింద ఏం ఉన్నాయని పురవాస్తు శాఖ అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

కానీ తవ్వకాల్లో అస్థి పంజరాలు, మట్టి పాత్రలు, పనిముట్లు, ఇతర వస్తువులు లభ్యమయ్యాయి. ఆస్థి పంజరం సైజు కూడా పది ఫీట్ల వరకు ఉంది. ఎముకల సైజు ఎక్కువగా ఉంది. వీటి అన్నింటిని హైదారాబాద్‌కు తరలించారు. ఆది మానవులు.. కుటుంబ సభ్యులందరిని ఒకే సమాధులు పాతి పెట్టేవారు. అంతేకాకుండా వాళ్లు వినియోగించిన ప్రతి వస్తువు కూడా సమాధుల్లోనే పాతి పెట్టేవారు. దీంతో సమాధి తవ్వితే ఇలాంటి ఆనవాళ్లు బయటకు వస్తున్నాయి. జంతువులను వేటాడే ఆయుధాలు, ఆహారం కోసం వినియోగించే పాత్రలను కూడా సమాధిలో పెట్టే సాంప్రదాయం ఉండేది. గతంలో తవ్వకాలు చేస్తే ఇలాంటి వస్తువులు బయటకు వచ్చాయి.

కొండ సమీపంలో పెద్ద ఎత్తున సమాధులు ఉన్నాయి. రైతులు చదను చేసి బండరాళ్లను తొలగిస్తున్నారు. దీంతో సమాధులు కనమరగువుతున్నాయి. ఈ సమాధులను పరిరక్షించి పర్యాటక కేంద్రంగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు. రైతులు చదును చేస్తున్న సమయంలో కూడా అస్థి పంజరాలతో పాటు, పురాతన వస్తువులు బయటకు వస్తున్నాయి. అంతేకాదు ఈ ప్రాంతంలో వివిధ రాళ్లు కూడా ఉన్నాయి. ఈ రాళ్లతోనే ఆయుధాలను నూరేవారు. ఈ గ్రామంలో అడుగు పెట్టాలన్నదే.. ఆదిమానవుల చరిత్ర గుర్తుకొస్తుంది. గతంలో తవ్వకాలు వెలికితీసిన వస్తువులను ఈ గ్రామంలోనే భద్రపర్చాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామంలోనే మ్యూజియం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి అధికారుల నిర్లక్ష్యంతో నాటి చరిత్ర నేటి సమాజానికి దూరమవుతుంది. చరిత్రను వెలికి తీయాలని కోరుతున్నారు స్థానికులు.

45 యేళ్ల క్రితం సమాధులు తవ్వారని స్థానికులు అంటున్నారు. పెద్ద పెద్ద కుండలు, ఇతర పాత్రలు బయటకు వచ్చాయని చెబుతున్నారు. భారీ సైజులు ఉండే ఎముకలు కూడా చూశామని చెబుతున్నారు. తవ్వే సమయంలో తాము దగ్గరగా ఉన్నామని స్థానికులు అన్నారు. ఆదిమానవుడి ఆస్థి పంజరం 8 ఫీట్ల కంటే ఎక్కువగా ఉందని తెలుపుతున్నారు. వివిధ రకాల వస్తువులు కూడా సమాధులు ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ దాదాపు అన్ని పొలాల వద్ద సమాధులు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. వాటిని కాపాడుతున్నామని తెలుపుతున్నారు. తవ్వకాలు, వివిధ వస్తువులు లభిస్తున్నాయని చెప్పారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి