Telangana: ఆ ఎంపీ మౌనం వెనుక అసలు కారణం ఏంటి.. పార్టీలో ఉంటారా.. జంప్ అవుతారా..?

| Edited By: Srikar T

Feb 26, 2024 | 4:57 PM

ఎన్నికలు వస్తున్నాయి అంటే చాలు ఎక్కడెక్కడో ఉండే నేతలు అందరు వారి వారి నియోజకావర్గలోకి వచ్చి చేరుతారు. టికెట్ కోసం పక్క నియోజకవర్గాల వైపు కూడా చూస్తారు. కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ఓ నేత మాత్రం చాలా వెరైటీగా ఉన్నారు. ఎంపీ ఎన్నికలు హడావుడి జరుగుతున్న నేపథ్యంలో కూడా సొంత నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.

Telangana: ఆ ఎంపీ మౌనం వెనుక అసలు కారణం ఏంటి.. పార్టీలో ఉంటారా.. జంప్ అవుతారా..?
Zaheerabad Mp
Follow us on

ఎన్నికలు వస్తున్నాయి అంటే చాలు ఎక్కడెక్కడో ఉండే నేతలు అందరు వారి వారి నియోజకావర్గలోకి వచ్చి చేరుతారు. టికెట్ కోసం పక్క నియోజకవర్గాల వైపు కూడా చూస్తారు. కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ఓ నేత మాత్రం చాలా వెరైటీగా ఉన్నారు. ఎంపీ ఎన్నికలు హడావుడి జరుగుతున్న నేపథ్యంలో కూడా సొంత నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇంతకీ ఎవరా నేత.? రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ ఎన్నికల హడావుడి మొదలు అయ్యింది. నేతలందరూ బిజీ అయిపోయారు. ప్రజల్లో మమేకం అవ్వడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ మాత్రం నియోజకవర్గనికి చాలా దూరంగా సైలెంట్‎గా ఉంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి రెండు సార్లు జహీరాబాద్ ఎంపీగా గెలిచారు బీబీ పాటిల్. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. చాలా చోట్ల సిట్టింగ్ ఎంపీలు, టికెట్ ఆశించే వారు నియోజకవర్గ వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నారు. బీబీ పాటిల్ మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా జహీరాబాద్ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారట. బీబీ పాటిల్ జహీరాబాద్ నుండి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. మూడోసారి కూడా తనకే టికెట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆయన అలెర్ట్‎గా ఉండాల్సింది పోయి, ఎందుకు లైట్ తీసుకుంటున్నారో ఎవరికి అర్ధం కావడం లేదు.

బీబీ పాటిల్ వ్యవహార శైలిని చుస్తే అసలు ఈసారి ఆయన ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో అనే అనుమానం వస్తోంది. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ నేతలకు.. నియోజకవర్గ పరిధిలో మీరు తిరగాలి సార్ లేకపోతే ఇబ్బంది అవుతుంది అని, బీబీ పాటిల్ అనుచరులు కూడా చాలా సార్లు చెప్పారట. ఈ విషయంపై ఆయన మాత్రం నోరు మెదపలేదు. బీబీ పాటిల్ మౌనం వెనుక ఉన్న కారణాలు ఏంటో అనేది ఎవరికి అంతుచిక్కడం లేదు. ఇవన్నీ గమనిస్తున్న కొంతమంది ఇతర పార్టీల నేతలు బీబీ పాటిల్ పార్టీ మారే అవకాశం ఉంది అని ప్రచారం చేస్తున్నారు. మరి కొంతమంది అయితే బీబీ పాటిల్ బీఆర్ఎస్‎లోనే ఉంటారు కానీ ఎంపీగా పోటీ చేసే అవకాశం లేదని ప్రచారం చేస్తున్నారు. మరి కొంతమంది అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కావున పూణేలో ఉన్న బిజినెస్‎లు చూసుకుంటూ ఆవైపుకు వెళ్లిపోతారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు.

రెండు సార్లు ఎంపీగా గెలిచిన బీబీ పాటిల్ అస్సలు సంతోషంగా లేరని చెబుతున్నారు. ప్రతి ఎన్నికల్లో కూడా సొంత పార్టీలోనే కొంతమంది ఎమ్మెల్యేలు ఆయన్ను ఇబ్బందులకు గురి చేసారట. ముఖ్యంగా నారాయణ ఖేడ్, జహీరాబాద్, అంధోల్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కొంతమంది బీఆర్ఎస్ సీనియర్ లీడర్ల్ ఆయన్ని ఇబ్బందులకు గురి చేసారట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే బీబీ పాటిల్ ఇప్పుడు చాలా సైలెంట్‎గా ఉంటున్నారన్న మరో ప్రచారం జరుగుతోంది. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో.. ఒక మౌనానికి వంద అర్ధాలు అంటే ఇదేనేమో అని.. ఇంతమంది ఎదో ఒకటి ఆయన గురించి ప్రచారం చేసినా ఆయన మాత్రం మౌనం వీడక పోవడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కూడా కొంత ఆందోళన కలిగిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..