Telangana: అర్ధరాత్రి స్టైల్‌గా సిగరెట్ తాగుతూ వచ్చాడు.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్‌కి మైండ్ బ్లాంక్

ఓ దొంగ అర్ధరాత్రి ఎవరూ లేని సమయం చూసి.. సీసీ కెమెరాలకు కూడా చిక్కకుండా దొంగతనం చేసేందుకు ఒక ప్రాంతానికి వచ్చాడు. ఇక అక్కడ మనోడికి డబ్బు కనిపించలేదు, నగలు కనిపించలేదు.. మరే వస్తువులు కనబడలేదు. మరి ఏం దొంగతనం చేశాడంటే..

Telangana: అర్ధరాత్రి స్టైల్‌గా సిగరెట్ తాగుతూ వచ్చాడు.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్‌కి మైండ్ బ్లాంక్
Trending

Edited By:

Updated on: Jun 05, 2025 | 11:29 AM

దొంగోడికి చెప్పే లాభం అనే సామెత ఇలాంటి దొంగతనాల వల్లే పుట్టి ఉంటుంది. దొంగతనానికి వచ్చిన వ్యక్తికి ఏం దొరక్కపోవడంతో చెప్పులు ఎత్తుకెళ్లాడు. దొంగతనానికి వచ్చి ఊరికే వెళ్లడం ఎందుకని అనుకున్నాడో.. ఏమో కానీ.. చెప్పులు చేత పట్టుకుని వెళ్లిపోయిన దొంగ వీడియోలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదంతా సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో రాత్రి వేళల్లో దొంగల బెడదతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. గత కొంతకాలంగా మున్సిపల్ వీధుల్లో ఇంటి బయట విలువైన వస్తువులు, ఇతర సామగ్రిలు మాయమవుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఇక్కడ నివసిస్తుంటారు. మరి దొంగతనాలు ఎవరు చేస్తున్నారో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిర్వహణ లేక, అవి కొన్ని చోట్ల సరిగ్గా పని చేయడం లేదు. దానికి తోడుగా పోలీసులు నిఘా లేకపోవడంతో అదునుగా భావించిన దుండగులు మంగళవారం రాత్రి ఓ ఇంటి ఆవరణలో సంచరిస్తుండగా సీసీటీవీలో రికార్డ్ అయింది. అయితే ఆ ఇంట్లోకి దొంగతనానికి వెళ్లిన దొంగకు ఎంతసేపు వెతికినా ఏమి దొరకకపోవడంతో ఖాళీగా వెళ్లడం ఎందుకని అక్కడే ఉన్న చెప్పులు ఎత్తుకుని వెళ్లాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసిన అందరూ దొంగకు చెప్పే లాభం అనే సామెత కరెక్టేనని అనుకుంటున్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us