Telangana: వారెవ్వా..! గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మెసేజ్‌లు కాదు.. వాట్సాప్ గ్రూప్ అంటే ఇదికదా..!
15 సంవత్సరాలుగా అధికారులు చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయారు ఆ ఊరి ప్రజలు. చివరికి అందరు కలిసి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. వాట్సాప్ గ్రూప్‌లో చర్చించుకున్నారు. వారి గ్రామానికి రోడ్డు చక్కదిద్దుకున్నారు.
15 సంవత్సరాలుగా అధికారులు చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయారు ఆ ఊరి ప్రజలు. చివరికి అందరు కలిసి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. వాట్సాప్ గ్రూప్‌లో చర్చించుకున్నారు. వారి గ్రామానికి రోడ్డు చక్కదిద్దుకున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నాగులపల్లి గ్రామస్తులు బీటీ రోడ్ మరమ్మత్తులకై 15 సంవత్సరాలుగా నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమను ఎవరు పట్టించుకోవడంలేదని, ప్రభుత్వాలు మారిన రోడ్డు మరమ్మత్తు మాత్రం జరగలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులు.
ఇక, లాభం లేదనుకున్నారు. తమ ఊరి రోడ్డును తామే బాగు చేసుకోవాలనుకున్నారు. తమ గ్రామస్తులంతా చర్చించుకుని డబ్బులు పోగు చేసి రోడ్డు మరమ్మత్తు చేసుకున్నారు. నాగులపల్లి గ్రామ వాట్సాప్ గ్రూపులో గ్రామ సమస్యల గురించి చర్చించుకుంటూ, గ్రామం అభివృద్ధి చెందాలంటే ముందు రవాణా వ్యవస్థ బాగుండాలనుకున్నారు. అందుకుగాను నాగులపల్లి నుండి దౌల్తాబాద్ వెళ్లే రహదారి అధ్వానంగా మారిందని, ఏదైనా పనిమీద వెళ్లాలన్నా, అత్యవసర నిమిత్తం వెళ్లాలన్న దుర్భరమైన రహదారి గుండా వెళ్లలేమంటూ చర్చించుకోసాగారు. అధికారులకు నాయకులకు ఆశపడకుండా తమ రహదారిని తామే చక్కదిద్దుకుందామంటూ తోచినంత సహాయం చేయాలంటూ వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్‌లు పెట్టుకోగా గ్రామంలోని యువకులు మహిళలు, ఆటో, ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ కలసి 50 వేల రూపాయల వరకు పోగుచేసి రహదారి మరమ్మత్తు చేపట్టారు.
దసరా బతుకమ్మ పండగల సందర్భంగా తమ గ్రామానికి బంధువులు రావడానికి ఇబ్బంది పడుతున్నారని, గ్రామస్తులు సైతం వర్షాలు పడి రహదారి గుండా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అందుకుగాను గ్రామస్తులు అందరం ట్రాక్టర్లు, డోజర్ల సహాయంతో 50 వేల రూపాయలు పోగు చేసి మరమ్మత్తు చేసుకున్నారు. ఎవరి మీద ఆధారపడకుండా, ప్రభుత్వ సాయం ఎదురు చూడకుడా రోడ్డు నిర్మాణం చేసుకున్న గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..