Telangana IPS: తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లకు తాత్కాలిక పోస్టింగ్‌లు.. ట్రాఫిక్‌ డీసీపీ ఆకస్మిక బదిలీ

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐపీఎస్‌ అధికారులకు ప్రభుత్వం తాత్కాలిక పోస్టింగ్‌లు ఇచ్చింది. హైదరాబాద్‌ పరిపాలనా విభాగాకి చెందిన సంయుక్త కార్యదర్శిగా రమేష్‌రెడ్డి..

Telangana IPS: తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లకు తాత్కాలిక పోస్టింగ్‌లు.. ట్రాఫిక్‌ డీసీపీ ఆకస్మిక బదిలీ
Telangana Government

Updated on: Mar 05, 2022 | 2:16 PM

Telangana IPS: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐపీఎస్‌ అధికారులకు ప్రభుత్వం తాత్కాలిక పోస్టింగ్‌లు ఇచ్చింది. హైదరాబాద్‌ పరిపాలనా విభాగాకి చెందిన సంయుక్త కార్యదర్శిగా రమేష్‌రెడ్డి, హైదరాబాద్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా రాజేష్‌ చంద్రకు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్‌ దక్షిణ జోన్‌ డీసీపీగా సాయి చైతన్య, హైదరాబాద్‌ తూర్పు జోన్‌ డీసీపీగా సతీష్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక మరోవైపు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ను ఆకస్మికంగా బదిలీ చేసింది. డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: Giri Nature Honey: తొలి సహజ తేనె సేకరణ యూనిట్‌.. స్వచ్చతకు మారుపేరు గిరి హనీ.. వావ్ టేస్ట్ గురూ

Hyderabad: ఘనంగా జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. నేడు స్వామివారికి గరుడ వాహన సేవ..