Telangana: అంతర్జాతీయ క్రీడల్లో విజేతలకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా

|

Jun 01, 2022 | 5:59 PM

Telangana: అంతర్జాతీయ క్రీడల్లో ఘన విజయాన్ని సాధించి తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన తెలంగాణ బిడ్డలను సమున్నతంగా గౌరవించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్..

Telangana: అంతర్జాతీయ క్రీడల్లో విజేతలకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా
Follow us on

Telangana: అంతర్జాతీయ క్రీడల్లో ఘన విజయాన్ని సాధించి తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన తెలంగాణ బిడ్డలను సమున్నతంగా గౌరవించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవల టర్కీలో జరిగిన అంతర్జాతీయ మహిళా బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్‌కు, జర్మనీలో జరిగిన ఐఎస్ ఎస్ ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన ఈషా సింగ్ లకు ఒక్కొక్కరికి రూ 2 కోట్ల నగదు బహుమతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగదు బహుమతితో పాటు వీరికి బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో నివాసయోగ్యమైన ఇంటిస్థలాన్ని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అంతేకాకుండా పద్మశ్రీ కిన్నెరమెట్ల మొగులయ్యకు కోటి రూపాయల నగదు పురస్కారం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. జూన్‌ 2న నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల్లో ఈ పురస్కారాలను తెలంగాణ ప్రభుత్వం అందజేయనుంది.

కాగా, స్వర్ణ పతక విజేత, తెలంగాణ ఆణిముత్యం నిఖత్ జరీన్ మే 27న హైదరాబాద్‌కు చేరుకోగా, తొలిసారి తెలంగాణకు వచ్చిన నిఖత్​జరీన్​కు సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో భారీ స్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర క్రీడా శాఖ ఘన స్వాగతం పలికింది. నిఖత్‌తో పాటు జర్మనీలో జరిగిన ప్రపంచ షూటింగ్ ఛాంపియన్​షిప్​లో గోల్డ్ మెడల్స్ సాధించిన సికింద్రాబాద్‌కు చెందిన ఇషా సింగ్, ఫుట్​బాల్ ప్లేయర్​సౌమ్య​కూడా హైదరాబాద్​చేరుకోవడంతో ఘన స్వాగతం లభించింది.

ఇవి కూడా చదవండి

కాగా, ఇటీవల టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో నిఖత్‌ జరిన్‌ సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఫైనల్స్‌లో 52 కేజీల విభాగంలో థాయ్‌లాండ్‌కు చెందిన జుటామస్‌ జిటిపాంగ్‌ను 0-5తో చరిత్రను తిరగరాసి స్వర్ణ పతకాన్ని అందుకుంది. దీంతో మేరీకోమ్‌, సరితాదేవి, జెన్నీ, లేఖ తర్వాత ప్రపంచ టైటిల్‌ను గెలుచుకున్న ఐదో భారతీయ మహిళా జరీన్‌ నిలిచింది. అలాగే ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్ ప్రపంచకప్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్‌లో హైదరాబాద్‌కు చెందిన ఇషా సింగ్‌ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.

నిఖత్​ జరీన్ సాధించిన ఘనతలు:

☛ 2011లో ఇదే టర్కీలో ముగిసిన ఏఐబీఏ ఉమెన్స్ జూనియర్ అండ్ యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం సాధించింది

☛ 2014లో యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్‌లో సిల్వర్ మెడల్..

☛ 2015 లో అసోంలో ముగిసిన 16వ సీనియర్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది

☛ 2019 లో బ్యాంకాక్‌లో జరిగిన ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో సిల్వర్ మెడల్

☛ 2019, 2022 స్ట్రాంజ మెమోరియల్ బాక్సింగ్ టోర్నీలలో స్వర్ణం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి