
ఎవరైనా చనిపోతే వారి అవయవాలను దానం చేయండం కొంతమందిని రక్షించగలగుతాము. మానవతా దృక్పథంతో కొందరు తాము చనిపోయాక అవయవాలు దానం చేస్తానని నిర్ణయించుకుంటారు. దీనివల్ల ఇతర వ్యక్తులకు ప్రాణం పోయడమే కాదు వారి కుటుంబ సభ్యులను కూడా ఆదుకున్నవాళ్లవుతారు. తాజాగా ఇప్పుడు అలాంటి ఘటనే సంగారెడ్డిలో చోటుచేసుకుంది. సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న కొమ్ముల సుభాష్ చందర్ (59) తాను చనిపోయి మరో ఐదుగురికి పునర్జన్మనిచ్చినవారయ్యారు. వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి లో ఎస్సై గా పనిచేస్తున్న సుభాష్ చందర్ కుమార్ కుమారుడికి ఇటివలే వివాహం నిశ్చయమైంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఆయన కుటుంబ సభ్యులు నిమగ్నమయ్యారు. ఆ సమయమంలోనే సుభాష్ చందర్ ఇంట్లో మెట్లు ఎక్కుతుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. తలకు బలమైన కావడంతో చికిత్స కోసం హైదరాబాద్ లోని యశోదా ఆస్పత్రికి తరలించారు.
సుభాష్ చందర్ కు చికిత్స అందించనప్పటీకీ వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. బ్రెయిన్ డెడ్ అయినట్లుగా ప్రకటించారు. అయితే ఇదివరకే సుభాష్ చందర్ నిర్ణయం ప్రకారం అతని అవయవాలు దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. ఆయన నుంచి రెండు కిడ్నీలు, లీవర్, రెండు కార్నియాలను జీవన్ ధాన్ ట్రస్ట్ సేకరించింది. అనంతరం ఆయన అంత్యక్రియలు సంగారెడ్డిలో నిర్వహించారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. తాను మరణిస్తూ మరో ఐదుగురికి ప్రాణం పోసిన ఎస్ఐ సుభాష్ చందర్ గ్రేట్ అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అంత్యక్రియల్లో పాల్గొన్న ఆయన సుభాష్ చందర్ ఎంతో మంచి వ్యక్తి అని, అటువంటి వ్యక్తి మనలో లేకపోవడం చాలా బాధకరమని పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..